హైదరాబాద్

16 అంశాలకు ‘స్థారుూ’ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: మహానగరంలో చేపట్టే అభివృద్ధి, జిహెచ్‌ఎంసి పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన మరోసారి సమావేశమైంది. సంఘంలోని మొత్తం 15 మంది సభ్యులకు గాను 13 మంది మాత్రమే హాజరై 16 అంశాల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవటంతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే దూరమయ్యే అవకాశాలున్నాయి.
గ్రేటర్ పరిధిలో 826 బస్ షెల్టర్లను డిజైన్ తయారీ, నిర్మాణం, పెట్టుబడి నిర్వహణ, బదిలీ(డిబిఎఫ్‌వోటి) పద్దతిన నాలుగు ప్యాకేజీల్లో ఏర్పాటు చేసేందుకు, వాటికి కావల్సిన స్థలాలను ఎంపిక చేసే ప్రతిపాదనకు స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. * రూ. 48.95 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్‌తో పాటు హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో నాలుగు గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లనిర్మాణానికి పరిపాలనపరమైన ఆమోదం కోసం ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపే అంశానికి అనుకూలంగా సంఘం తీర్మానం * ట్రాఫిక్ ఎక్కువై వాహనదారులు ఇబ్బందులెదుర్కొంటున్న బేగంపేట నుంచి ప్రకృతి వైద్యశాలల మధ్య రూ. 2.18 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనకు సైతం స్థారుూ సంఘం ఆమోదముద్ర * స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా 150 వార్డులను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత వార్డులుగా జిహెచ్‌ఎంసి ప్రకటించుకున్న అంశాన్ని ప్రభుత్వానికి పంపేందుకు కూడా అంగీకారం * బుద్ధ్భవన్ మున్సిపల్ కాంప్లెక్సులోని బి బ్లాకు మొదటి అంతస్తులోని మూడవ నెంబర్ షాపును షెడ్యూల్డ్ కులానికి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల పాటు అద్దెకు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదం * దీంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సికిందరాబాద్ ఆదయ్యనగర్‌లోని కొత్త లైబ్రరీ నిర్మాణానికి సైతం గురువారం మోక్షం లభించింది. ఇక్కడున్న పాత గ్రంథాలయాన్ని కూల్చి, అక్కడే రూ. 2.98 కోట్ల వ్యయంతో నూతన లైబ్రరీ భవనానానికి మోక్షం * పాతబస్తీలోని నవాబ్‌సాబ్‌కుంటపై టనె్నల్ బాక్స్ నిర్మాణాని అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని తొలగించాలని, అందుకు రూ. 58.57లక్షలను నష్టపరిహారంగా ఇవ్వాలని కూడా నిర్ణయం. * 14వ ఆర్థిక సంఘం ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాల సాధన ఆధారిత గ్రాంట్లను పొందటానికి రూపొందించిన సర్వీస్ లెవెల్ టార్గెట్ల ప్రతిపాదనలకు సభ్యుల అమోదం. * ఫలక్‌నుమా నుంచి డబర్‌పురా వరకున్న మురికినాలా విస్తరణకు అడ్డుగా ఉన్న 146 నిర్మాణాల తొలగించి, యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు అనుకూలంగా నిర్ణయం * బయోడైవర్శిటీలో 209 మంది వర్కర్లను హెల్త్,శానిటేషన్ విభాగంలో తిరిగి నియమించాలన్న ప్రతిపాదనకు కూడా అనుకూలంగా నిర్ణయం * ఆస్తపన్ను, ట్రేడ్ లైసెన్సులలో ఉన్న లొసుగులను అరికట్టి జిహెచ్‌ఎంసి ఆస్తుల డేటాబేస్‌లను కమర్షియల్ ట్యాక్సు, సేల్స్‌ట్యాక్స్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ తదితర శాఖల డేటాబేస్‌తో అనుసంధానం చేసి కొత్త ఆస్తులను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా, ఈ బాధ్యతలను తెలంగాణ ఐటి శాఖకు అప్పగించాలని ప్రతిపాదనకు సైతం స్థారుూ సంఘం ఆమోదం * ఎలక్ట్రిక్ ఔట్ సోర్సు అసిస్టెంటు ఇంజనీర్లను నియమించుకుని, వారిని ప్రాజెక్టు మెయింటనెన్స్ విభాగానికి వినియోగించుకోవాలన్న ప్రతిపాదనను స్థారుూ సంఘం ఆమోదించింది.