హైదరాబాద్

మెట్రో పనులపై ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చవిచూసే మహానగర ప్రజల చిరకాల స్వప్నం మెట్రోరైలు ప్రారంభానికి కౌంట్ మొదలైందని చెప్పవచ్చు. వచ్చే నెల 28వ తేదీన ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు, నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ముప్పై కిలోమీటర్ల మెట్రోరైలు ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే! అంతేగాక, నవంబర్ నెలాఖరులో నగరంలో జరగనున్న ఓ అంతర్జాతీయ సదస్సుకు ఈ ముఖ్య అతిధిగా విచ్చేయనున్న ప్రధాని నరేంద్రమోదీ పనిలో పనిగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి ఆహ్వానం అందిన నేపథ్యంలో మెట్రో పనులపై పిఎంవో అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిర్మిస్తున్న కారిడార్ 1లోని మియాపూర్‌లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఇటీవలే విలేఖర్ల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే మియాపూర్‌లో ప్రధానికి భద్రత పరంగా ఎలాంటి పరిస్థితులున్నాయి? ప్రారంభించాలనుకున్న మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు, నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు కారిడార్లలో పనులెలా జరుగుతున్నాయి? ఒక వేళ ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నట్లు ఖరారు చేస్తే, అంతలోపు ఈ పనులు జరుగుతాయా? అన్న కోణాల్లో ప్రధాని కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక వేళ భద్రతా పరంగా మియాపూర్‌లో సానుకూలమైన పరిస్థితుల్లేకపోవటంతో ప్రయత్యామ్నాయంగా అమీర్‌పేటను గానీ, నాగోల్‌ను గానీ ప్రారంభోత్సవానికి వేదికగా ఎంపిక చేసే అంశాన్ని కూడా పిఎంవో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభోత్సవానికి సరిగ్గా 40 రోజులు మాత్రమే ఉండటంతో 30 కిలోమీటర్ల కారిడార్లలో ప్రారంభానికి అనుకూలంగా పనులన్నీ పూర్తవుతాయా? అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పనులు మరింత ఊపందుకున్నట్లు మెట్రోరైలు అధికారులు చెబుతున్నా, సాంకేతికంగా జరగాల్సిన పనులు కొంత వెనకబడిపోయాయాన్నట్లు చర్చ జరుగుతోంది. మెట్రోరైలు ప్రాజెక్టు గుతె్తైదారు సంస్థ అయిన ఎల్ అండ్ టికి గతంలో ఎండిగా వ్యవహారించిన గాడ్గిల్ పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన తరహాలో ఈ పనులను సివిల్ పరంగా శాస్ర్తియంగా, సాంకేతికంగా పర్యవేక్షించేంత సామర్థ్యం కల్గిన అధికారులు లేకపోవటం వల్లే కొంత వరకు మెట్రోరైలు పనులు నెమ్మది అయినట్లు చర్చ జరుగుతోంది.

ఎంబిబిఎస్ సీట్లు ఇప్పిస్తామని ఘరానా మోసం

ఖైరతాబాద్, అక్టోబర్ 16: ఎంబిబిఎస్‌లో సీట్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఓ సంస్థపై పంజాగుట్ట పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్‌అలిబాగ్‌కు చెందిన ఆర్. అనిల్‌కుమార్ తన కుమార్తెకు ఎంబిబిఎస్‌లో సీటు కావాలని సోమాజిగూడలోని మహేశ్వరి చాంబర్స్‌లో ఏర్పాటుచేసిన స్కైబ్రిడ్జ్ ఇన్ఫోటెక్ సంస్థను ఆశ్రయించాడు. సంస్థ నిర్వాహకులుగా పరిచయం చేసుకున్న శశాంక్ శేఖర్, దినేష్‌లు బెంగళూరులోని ఓ విశ్వవిద్యాలయంలో సీటు ఇప్పిస్తామని నమ్మించి అతని వద్ద నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా సీటు ఇప్పించకపోవడంతో వారిని నిలదీయగా నేడు, రేపు అంటూ దాటవేస్తూ వచ్చారు. దీంతో తిరిగి కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ కార్యాలయమే లేదు. దీంతో కంగుతున్న అనిల్‌కుమార్ హుటాహుటిన పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు