హైదరాబాద్

సదర్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, అక్టోబర్ 17: దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన సదర్ ఉత్సవానికి సర్వం సిద్ధమయిందని గత తొమ్మిది సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. మంగళవారం ముషీరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవాన్ని ఈ సంవత్సరం అధికారికంగా జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించటం హర్షనీయమని అన్నారు. మేలు రకమైన పశుజాతిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, జంతువులను ప్రేమించి, వాటిని సేవించటంతో మేలు రకమైన జాతిని రక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించ వచ్చని వివరించారు. నేడు సరైన అవగాహన లేకపోవడంతో ఒంగోలు జాతిని మనం కోల్పోయామని, ఇప్పుడు ఒంగోలు జాతి ఆవును చూడాలంటే బ్రెజిల్‌కు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇంతకాలం సదర్ ఉత్సవాలకు హర్యానకు చెందిన దారా, రాజాను తెచ్చేవారని, ఈసారి హర్యాన రుస్తుం సంతతి హైదరాబాద్‌కు చెందిన షెహన్‌షా ప్రత్యేకంగా నిలవబోతోందని అన్నారు. ఇటువంటి మేలు రకమైన జాతి ద్వారా పుట్టే బర్రెలు.. మామూలుగా మూడు నాలుగు బర్రెలు ఇచ్చే పాలను ఒకే బర్రె ఇస్తుందని, ఇటువంటి పశుజాతి గొప్పతనం ప్రపంచానికి తెలియచేసి అవగాహన కల్పిస్తే రాబోయే రోజుల్లో మనదేశం పాడి పంటలతో కళకళలాడుతుందని అభిప్రాయపడ్డారు. 21న ముషీరాబాద్ నుండి సదర్ ర్యాలీ ప్రారంభమై నారాయణగూడ వద్ద ఉత్సవాలు ముగుస్తాయని, నగర మంత్రులు, అధికారులు పాల్గొంటారని వివరించారు.

23నుంచి భగవద్గీత ప్రవచనాలు

ఖైరతాబాద్, అక్టోబర్ 17: చిన్మయ విద్యాలయ రజతోత్సవాలను పురస్కరించుకొని నగరంలో ఈనెల 23 నుంచి 29 వరకు భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మిషన్ రీజనల్ హెడ్ చిదాత్మానంద పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని చిన్మయ మిషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను చిదాత్మానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఖైరతాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో ఆరు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాలకు స్వామి తేజోమయనంద, స్వామి స్వరూపానందలు ముఖ్య అతిథిగా హాజరై ప్రవచనాలు చేస్తారని వివరించారు. ఉదయం వేళల్లో ప్రవచనాల బోధన, సాయంత్రం వేళల్లో ధ్యానం, మహా మృత్యుంజయ మంత్రాలపై ప్రవచనాలు ఉంటాయని వివరించారు. మానసిక ప్రశాంతతను కోరుకునే వారు ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో విముక్త చైతన్య స్వామి పాల్గొన్నారు.