హైదరాబాద్

ప్రజా సమస్యలపై స్పందించే రచయితలపై కుట్ర సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 17: ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు, సమాజ స్థితిగతులపై స్పందించే రచయితలను అణిచివేయాలనే కుట్రలు సరికావని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హిందూ ఫాసిస్టులు చేసిన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యని, రచయిత కంచ ఐలయ్యపై దాడిని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో విరసం కన్వీనర్ గీతాంజలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరవరరావు, సీనియర్ పాత్రికేయులు వీరయ్య, కవి శివారెడ్డి, నాగేందర్, కాకరాల, కృష్ణమూర్తి కాశిం, ప్రభాకర్ ప్రసంగించారు. సమయం కోసం ఎదురుచూసిన అగ్రకులస్థులు కంచ ఐలయ్య పుస్తకం రాయగానే మూకుమ్మడిగా దాడులకు పాల్పడేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తీరును ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ తనదైన పంథాలో విశే్లషిస్తూ ప్రజలకు చేరవేసేందుకు యత్నించిన గౌరీలంకేష్‌ను హిందూ ఫాసిస్టులే హత్య చేశారని ఆరోపించారు. గౌరీలంకేష్ హత్యను సైతం మావోయిస్టులు, ఇతరులకు ఆపాదించేందుకు రాజ్యం ప్రయత్నించిందని విమర్శించారు. భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని రాజ్యాంగం సూచించిన పరిధిలో కంచ ఐలయ్య పుస్తకాన్ని రాస్తే ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి నడిరోడ్డుపై నరకాలి, ముక్కలు ముక్కలుగా చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓ రచయితను చంపుతామని తీవ్రస్థాయిలో బెదిరింపులు రావడంతో తనకు తానుగా గృహనిర్బంధణలో ఉండిపోవాల్సి రావడం ఎంతో దారుణమని అన్నారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అంతగా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ముఖ్యమంత్రి పుస్తకాన్ని నిషేధించేందుకు సిద్ధపడటం ఆగ్రకులాల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంలో రచయితలకు భద్రత లేకపోవడం ఏమాత్రం సరికాదని అన్నారు.