హైదరాబాద్

‘బాలామృతం‘పై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: పిల్లలకు పోషిక విలువలను అందించేందుకు పంపిణీ చేస్తున్న బాలామృతంపై, దానిలోని పోషక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల పరిధిలోని ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల చిన్నారులందరికీ కేంద్రాల ద్వారా ఈ బాలామృతం అందేలా కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. ఇందుకు సూపర్‌వైజర్ల వారీగా అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం సంక్షేమాధికారి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీ వత్సకోటతో కలిసి అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై సిడిపివోలు, సూపర్‌వైజర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల వారీగా ఎంత మంది ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లలున్నారు? ఎంత మంది వివరాలను నమోదయ్యాయి? వారిలో కేంద్రాలకు వచ్చి బాలామృతం తీసుకుని, వారెందరో గుర్తించి వారిపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఇందుకు సూపర్‌వైజర్ల వారీగా కార్యచరణ రూపొందించుకుని, రాని పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీలకు వచ్చేలా వారి తల్లిదండ్రులను చైతన్యవంతులను చేయాలన్నారు. ఇందుకు గాను ఉచితంగా లభించే బాలామృతంలో గల పోషిక విలువలు అంటే కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ ఎన్ని పాళ్లున్నాయన్న, ఎబిసిడి, బి 12 విటమిన్ల శాతమెంత, అదే సమయంలో కిలో 200 నుంచి 250 రూపాయలకు కొనుగోలు చేసే సెరిలాక్, బోర్న్‌విటా, కాంప్లాన్ వంటి వాటిల్లో ఏఏ విటమిన్లు ఎంత శాతం ఉన్నాయో పోల్చి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. వాటి వివరాలను చార్టులు తయారు చేసి కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. రెగ్యులర్‌గా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి బాలామృతం స్వీకరించని వారితో పోల్చి ప్రత్యక్షంగా డిమాన్‌స్ట్రేట్ చేయలన్నారు. ప్రధానంగా బస్తీల్లో ప్రజలు మాట్లాడే, వారికి అర్థమయ్యే బాషలోనే వారికి వివరిస్తే బాగా అర్థం చేసుకుంటారని ఆమె వివరించారు. సిడిపివోలు, సూపర్‌వైజర్లు ముందుగా బాలామృతంలో గల పోషక విలువల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఆహారాన్ని తీసుకునేటపుడు చేతుల శుభ్రంగా కడుకోవాలని, గోళ్లు కత్తిరించుకోవాలని, తలలో పేలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతకు సంబంధించి అంశాలను కూడా వారికి చెబుతూ వారిని చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి సిడిపివో ప రిధిలో అత్యంత నిరుపేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను సంబంధిత సూపర్‌వైజర్లు సంబంధిత నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా కేంధ్రాల్లోని ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల మొత్తం పిల్లలు, వారి వివరాలను, నమోదు, గర్భిణిల వివరాలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా ఉండాలని కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మహిళా,శిశు,వికలాంగుల, వయోవృద్థుల అభివృద్ధి శాఖ జిల్లా వెల్ఫేర్ అధికారి సునంద, స్ర్తి శిశు సంక్షేమ పర్యవేక్షణ నిమిత్తం స్పెషల్ అధికారిగా నియమితులైన స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ శ్రీ వత్సకోట, సిడిపివోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.