హైదరాబాద్

బల్దియాపై విజి‘లెన్సు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: మహానగర పాలక సంస్థ బల్దియాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కార్పొరేషన్‌లోని పలు విభాగాల్లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు సమాచారం సేకరించిన విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖలు తరుచూ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా బల్దియా రవాణా విభాగంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కార్మిక నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు ఆ విభాగంపై కూడా విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
నగరంలోని ఐదు పార్కింగ్ యార్డుల్లో వాహనాల మరమ్మతులు, వాటికి విడిభాగాల భిగింపుతో పాటు డీజిల్ కేటాయింపునకు సంబంధించి నాలుగు యార్డుల్లో ఒకే రకమైన విధానం కొనసాగుతున్నా, ఒక్క మలక్‌పేట జైల్ గార్డెన్ పార్కింగ్ యార్డులో సరికొత్త విధానం కొనసాగుతుండటం, రవాణాను జోన్ల వారీగా వికేంద్రీకరంచిన తర్వాత వాహనాల సంఖ్య తగ్గినా, మరమ్మతులు, ఇంధనం వ్యయం గణనీయంగా పెరగటం పట్ల ఉన్నతాధికారులు విజిలెన్స్‌కు విచారణ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. వివిధ రకాల అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న మలక్‌పేట జైల్ గార్డెన్ డిఈపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని రెండురోజుల క్రితం కార్మిక సంఘాలు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే! అంతకు ముందుకు ఈ పార్కింగ్ యార్డులో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై కమిషనర్‌కు సైతం యూనియన్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! అయితే నాలుగు పార్కింగ్ యార్డుల్లో ఒక విధానం, జైల్‌గార్డెన్ పార్కింగ్ యార్డులో మరో విధానం కొనసాగుతుండటం పట్ల ఉన్నతాధికారుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, ఇతర పార్కింగ్ యార్డుల్లో మాదిరిగా రిపేరుకు వచ్చిన వాహనాలకు విడి భాగాలను అమర్చే ప్రక్రియలో భాగంగా ఈ భాగాలను కొనుగోలు చేసేందుకు రూపొందించిన ఇండెంట్లపై ఇక్కడి డిఈ మెకానిక్‌ల సంతకాలు తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే మెకానిక్‌లపై విజిలెన్స్ విచారణ ఉన్నందునే వారి సంతకాలు తీసుకోలేదని పార్కింగ్ యార్డు అధికారులు చెబుతున్న సమాధానానికి కార్మిక సంఘం నేతలు, ఇక్కడి మెకానిక్‌లు ఏకీభవించటం లేదు. ఎవరిపై విజిలెన్స్ విచారణలు కొనసాగుతున్నాయి? ఒక వేళ విచారణ ఎదుర్కొంటున్న మెకానిక్‌ల సంతకాలు తీసుకొరాదంటూ విజిలెన్స్ ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిందా? అని నేతలు, మెకానిక్‌లు గట్టిగా ప్రశ్నించటంతో ఈ పార్కింగ్ యార్డులో అక్రమాలు ఎక్కడ, ఎలా చోటుచేసుకుంటున్నాయన్న విషయాన్ని బయటకు తీసేందుకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. వివిధ రకాల ఆరోపణలెదుర్కొంటున్న డిఈని విజిలెన్స్ పోలీసులు విచారించినట్లు తెలిసింది.