హైదరాబాద్

థియేటర్ గేట్ మూసేస్తూ గోడ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, నవంబర్ 12: థియేటర్ గేట్ మూసేస్తూ నింబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ప్రహరీను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ప్రహరీ నిర్మించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.నాగేందర్ అనే వ్యాపారి 1978లో దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన చౌరస్తా సమీపంలో మేకల జంగారెడ్డి అనే వ్యక్తి వద్ద 3535 గజాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. జంగారెడ్డి, అతని తల్లి కమలమ్మ నవంబర్ 15, 1978న సదరు స్థలాన్ని నాగేందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో సదరు స్థలానికి పక్కన ఉన్న కొన్ని గజాల స్థలాన్ని పాసివ్ (రహదారి) వదిలేసి రిజిస్ట్రేషన్ చేశారు. తదనంతరం నాగేందర్ ఆ స్థలంలో కోణార్క్ థియేటర్‌ను నిర్మించాడు. అప్పటి నుండి థియేటర్ రెండు గేటుల వైపు నుండి రాకపోకలు సాగిస్తుంది. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తా వైపు ఉన్న గేటు వద్ద ఉన్న రహదారిపై జంగారెడ్డి కుమారుల కన్ను పడింది. దాని పక్కన ఉన్న సుమారు 500 గజాల స్థలాన్ని ఎంఆర్‌ఆర్ అనే వైన్‌షాప్‌కు అద్దెకిచ్చారు. వైన్‌షాప్‌కు వస్తున్న వినియోగదారుల వాహనాలు థియేటర్ గేట్‌కు అడ్డంగా పార్క్ చేస్తున్నారు. పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని థియేటర్ యాజమాన్య సూచించింది. మార్పు రాకపోవడంతో పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థల యజమాని జంగారెడ్డి కుమారులు లక్ష్మినరసింహా రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి ఆదివారం తెల్లవారుఝామున గుట్టు చప్పుడు కాకుండా గేటుకు ఆనుకొని సమాంతరంగా ప్రహారీ గోడను నిర్మించారు. కోణార్క్ థియేటర్ స్థల విక్రయ పత్రాలను పరిశీలించిన పోలీసులు గేటు పక్కన ఉన్న స్థలం రహదారికి వదిలేసినట్లు గుర్తించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన జంగారెడ్డి, అతని కుమారులు లక్ష్మినర్సింహా రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంఆర్‌ఆర్ వైన్‌షాప్ యజమాని రాంరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయరామ్ తెలిపారు.