హైదరాబాద్

అమృత్‌సర్‌లో మేయర్ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఇతర అధికారులతో కూడిన బృందం శుక్రవారం అమృత్‌సర్‌ను సందర్శించింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి నమూనాను పరిశీలించేందుకు వెళ్లిన ఈ బృందం స్వర్ణదేవాలయాన్ని కూడా సందర్శించారు. సుమారు రూ. 160 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అమృత్‌సర్ నగర పరివర్తన ప్రాజెక్టు అమలును బృందం స్వయంగా పరిశీలించింది. ఇదే నమూనాలో చార్మినార్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధ్యయనం కోసం అమృత్‌సర్ వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు సూచన మేరకు శుక్ర, శనివారాలు రెండురోజుల పాటు అమృత్‌సర్‌లో మేయర్ బృందం అధ్యయనం చేయనుంది. పంజాబ్ పర్యాటక, వారసత్వ పరిరక్షణ శాఖ ఆధ్వర్యంల చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా స్వర్ణదేవాలయం చుట్టూ పాత్‌వేల అభివృద్ధి ఒకే మాదిరిగా ఉన్న దుకాణాలు, స్ట్రీట్ ఫర్నిచర్, వ్యర్థాల నిర్వహణ, వీది ధీపాల ఏర్పాటు తదితర అంశాలను ఈ ప్రతినిధుల బృందం పరిశీలించింది. శనివారం అమృత్‌సర్ అభివృద్ధికి సంబంధించిన అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు బలాలా,అహ్మద్ పాషాఖాద్రి, చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్, సౌత్‌జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు.
నేడు పురాణం 21వ సంస్మరణ సభ

హైదరాబాద్, నవంబర్ 17: కోకిలమ్ సాహితీ, సాంస్కృతిక వేదిక, తెలంగాణ సాహితీ సంయుక్త్ధ్వార్యంలో ప్రముఖ రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ 21వ సంస్మరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసిఐఎల్ సమీపంలోని సౌత్ కమలానగర్‌లో గల సోనీ సెంటర్‌లో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించనున్న ఈ సంస్మరణ కార్యక్రమానికి రచయిత, ప్రముఖ సినీనటుడు గొల్లపూడి మారుతీరావు అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. వీరితో పాటు రచయితలు కస్తూరి మురళీకృష్ణ, పులిగడ్డ విశ్వనాథరావు, వేదగిరి రాంబాబు, జర్నలిస్టు పురాణం శ్రీనివాస శాస్ర్తీ, తెలంగాణ సాహితీ కన్వీనర్ జి. యాదగిరిరావు, కోకిలమ్ సాహితీ, సాంస్కృతిక వేదిక కార్యదర్శి మరింగంటి రంగాచార్యులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రచయితలు, కవులతో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.