హైదరాబాద్

నిజాయితీగా పనిచేస్తే వచ్చే కిక్కే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: నిజాయితీతో సమర్థవంతంగా పనిచేస్తే ఎంతో కిక్‌గా ఉంటుందని, ఆ కిక్ హైదరాబాద్ బిర్యానీ తిన్నా ఉండదని వ్యాఖ్యానించారు జిల్లా కలెక్టర్ యోగితారాణా. విఆర్‌ఓలు తమ జాబ్‌చార్టుతో పాటు రెవెన్యూ పరమైన అంశాలపై అవగాహాన కల్గి ఉండాలని, అపుడే వారు సక్రమంగా విధులు నిర్వహించి ప్రజల నుంచి గౌరవం పొందుతారని సూచించారు. విఆర్‌ఓల విధులు, వారికి రెవెన్యూపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ అనే కుటుంబంలో కలెక్టర్ కుటుంబ యజమాని అయితే విఆర్‌ఓలు పిల్లలు లాంటి వారని వివరించారు. పిల్లలు తమ నిర్దేశిత విధులను నిబద్దతతో, అవినీతి రహితంగా నిర్వహించినపుడు కలెక్టర్‌కు తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఈ దివగా విఆర్‌ఓలు పనిచేయాలని అన్నారు. విఆర్‌ఓలు తాము కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులను త్వరితగతిన వెరిఫికేషన్ చేయటం, మీసేవా సర్ట్ఫికెట్లు నిర్ణీత వ్యవధిలో జారీ చేసేలా శ్రీఘ్రగతిని ఎంక్వైరీ చేయటం ముఖ్యమైన విధులుగా ఆమె వివరించారు. ఇందుకు ఆయా పనుల నిర్వహణపై అవగాహన కల్గించాలని అప్పుడే తమపై తమకు ఆత్మవిశ్వాసం, నమ్మకం కలుగుతుందన్నారు. ప్రధానంగా తమ పరిధిలోని ప్రభుత్వం భూములను పరిరక్షించుట విఆర్‌ఓలు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ ఉద్యోగంలోనైనా చేరిన తొలి రోజుల్లోనే స్పష్టత ఉండాలని ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న స్పష్టత రావాలని ఆమె సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ ఏ స్థాయి ఉద్యోగికైనా శిక్షణ తప్పనిసరి అని, శిక్షణ ద్వారానే ఆయా అంశాలు అవగతమవుతాయన్నారు. శిక్షణ కార్యఅకమంలో తాను నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈఎం శ్రీ వత్సకోట, ఆర్డీఓ చంద్రకళ, ఎస్టీపి మధుమోహన్, ఇన్‌చార్జి ఏఓ రాధికారమణి, శిక్షణ సమన్వయకర్త రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.