హైదరాబాద్

గురుకుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర సాధనకు రాజ్యాంగాన్ని సవరించారని, కేసీఆర్ తలుచుకుంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను సర్వీసులు క్రమబద్ధీకరించం కష్టం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సాంఘిక గరుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సర్వీసులు క్రమబద్ధీకరించాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరవధిక రిలే దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. గురుకుల పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సర్వీసులు క్రమబద్ధీకరించాలనిసూచించారు. కార్యక్రమంలో టీజేఏసీ ప్రధాన కార్యదర్శి వెంకట రెడ్డి, బాల్‌రాజ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు మానవతారాయ్, మాణిక్ రెడ్డి, సుష్మ, అనిత, శోభ, గీత మాధవి రాజ్యలక్ష్మి దీక్షలో పాల్గొన్నారు.

96 ముందు పదవీ విరమణ
చేసిన వారికి ఎఐసిటిఇ స్కేళ్లు ఇవ్వాలి
*రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులు

హైదరాబాద్, నవంబర్ 19: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖలో 1996 కంటే ముందు పదవీవిరమణ చేసిన సిబ్బందికి ఎఐసిటిఇ నిర్ణయించి వేతన స్కేళ్లకు అనుగుణంగా పెన్షన్ లబ్ధిని కల్పించాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ పూర్వ కార్యదర్శి కెఎస్ శాస్ర్తీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 1996 తర్వాత పదవీవిరమణ చేసిన వారికి ఈ బెనిఫిట్‌ను క్లైమ్ చేసే అవకాశం కల్పించారన్నారు. 96కు ముందు పదవి విరమణ చేసిన వారికి ఈ క్లైమ్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించినందు వల్ల నష్టపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ డిమాండ్‌ను గత మూడేళ్లుగా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామన్నారు. చాలా మంది ఉద్యోగుల వయస్సు 82 సంవత్సరాలు దాటిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే తమ మొరను ఆలకించి బెనిఫిట్లను కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా తమ డిమాండ్‌ను సానుభూతితో పరిశీలించి న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరారు.