హైదరాబాద్

ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర బిసి సంఘం నాయకులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును అభినందించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర బిసి సంఘం అధ్యక్షుడు ఎ. రాజేశ్వర్ యాదవ్ నాయకత్వంలో బిసి సంఘం నాయకులు రఘు, భాస్కర్ తదితరులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రాజేశ్వర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఫీజు రీయంబర్స్‌మెంట్ సక్రమంగా చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువు నిలిపి వేశారని చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ఇబ్బంది లేదని, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

పనిచేస్తున్న హోటల్‌లోనే చోరీ

చిక్కడపల్లి, నవంబర్ 21: తనకు ఉపాధి కల్పించిన హోటల్‌లోనే చోరీకి పాల్పడి తెలివిగా తప్పించుకోబోయిన యువకుడిని గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను చిక్కడపల్లి ఏసీపీ ప్రదీప్ కుమర్ రెడ్డి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం గ్రామానికి చెందిన పోతూరి గౌతమ్ వర్మ (26) అనే వ్యక్తి గత ఎనిమిది నెలలుగా ఇందిరాపార్కు వద్ద నున్న 25 అవర్స్ అనే హోటల్‌లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న రాత్రి హోటల్‌లో ఎవరూ చూడకుండా ఎండీ కాబిన్‌లో డ్రాలో నుండి దాదాపు రెండు లక్షల రూపాయలు దొంగిలించి తన బంధువులు ఎవరో చనిపోయారని హోటల్ నిర్వాహకులను నమ్మించి వెళ్లిపోయాడు. హోటల్ ఎండీ విజయాభాను తన కాబిన్‌లో డబ్బు మాయం అవటంతో 14వ తేదీ గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీపీ ఫుటేజీల ఆధారంతో గౌతమ్ వర్మ ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసిపోయింది. గౌతమ్ వర్మ గురించి గాలింపు ప్రారంభించిన పోలీసులు మంగళవారం ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో పట్టుకుని అరెస్ట్ చేశారు. కాబిన్ నుండి దొంగిలించిన డబ్బులో ఈ వారం రోజులలో దాదాపు 80వేల రూపాయలు జల్సాలకు ఖర్చు చేశాడని, మిగిలిన లక్షా పదివేల రూపాయలను, ఒక సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా రెండు హోటల్స్‌లో పనిచేసిన గౌతమ్ వర్మ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడటంతోనే అక్కడ పని నుండి తొలగించారని, చెడు అలవాట్లు ఉన్న వర్మ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. సీసీ కెమెరాలతో ఎటువంటి దొంగతనాలనైనా చాలా తక్కువ సమయంలో తేలికగా పట్టుకోగలుగుతున్నామని, ప్రతి హోటల్‌లో, కార్యాలయాలలో, ఇళ్లల్లో కూడా సీసీ కెమేరాలను ఏర్పాటుచేసుకోవాలని ఏసీపీ సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ పర్యవేక్షణలో గాంధీనగర్ సీఐ ఆర్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ టీ.శ్రీనాథ్ రెడ్డి, ఎస్‌ఐఆర్ రమేష్ ఎంతో చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్నారని అభినందించారు.