హైదరాబాద్

బల్దియాకు మరో మూడు స్కోచ్ మెరిట్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి)కి మరో మూడు స్కోచ్ మెరిట్ అవార్డులు దక్కాయి. ఈ నెల 20,21 తేదీల్లో దిల్లీలో జరిగిన 50వ స్కోచ్ సమ్మిట్‌లో భాగంగా ఈ అవార్డులను కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవటంలో, అలాగే మాన్యువల్‌గా పరిశీలించాల్సిన ఫైళ్లను డిజిటలైజేషన్ చేసుకోవటం, అలాగే భవన నిర్మాణ అనుమతుల జారీకి సంబంధించి అనురిస్తున్న డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సర్వీసు విధానాన్ని అనుసరిస్తున్న మూడు అంశాలకు గాను మూడు స్కోచ్ అవార్డులు జిహెచ్‌ఎంసిని వరించాయి. ఈ అవార్డులకు సంబంధించి సమ్మిట్‌కు ముందే జిహెచ్‌ఎంసి ఆదాయ వివరాలు, ఫైళ్ల డిజిటలైజేషన్, అలాగే భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతికి తావులేకుండా, దరఖాస్తుదారులకు ఇబ్బందుల్లేకుండా అనుసరిస్తున్న డిపిఎంఎస్ విధానానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపగా, వీటిని పరిశీలించిన స్కోచ్ 2017 సమ్మిట్ నిర్వాహకులు మూడు మెరిట్ అవార్డులను ప్రకటించగా, వాటిని ఈ నెల 21న కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వీకరించారు.

మన మెట్రో.. చెన్నైకు దీటుగా..
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 22: దేశంలోని మహానగరాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న పట్టణీకరణ, జనాభాకు అనుగుణంగా ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. అత్యాధునిక ప్రమాణాలు, విభిన్నమైన డిజైన్లలో మెట్రోరైలు పనులను చేపడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ప్రాతిపదికన చేపడుతుండటం ప్రపంచంలోనే మొట్టమొదటి సారి. కాగా, చెన్నైలో కేంద్ర, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అక్కడి ప్రభుత్వం పనులను చేపడుతోంది. కానీ పనులు జరుగుతున్న తీరును గమనిస్తే హైదరాబాద్ నగరం కన్నా చెన్నై మెట్రో పనుల్లో ముందంజలో ఉన్నా, తొలి దశగా అక్కడ కేవలం పది కిలోమీటర్లు మాత్రమే ప్రారంభించగా, మన నగరంలో ఈ నెల 28న రెండు కారిడార్లలో ఏకంగా 30 కిలోమీటర్ల మేరకు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇంత మేర పొడవు మెట్రోరైలును ప్రారంభించటం కూడా ఇదే ప్రథమం. స్థల సేకరణను అక్కడి ప్రభుత్వమే చేపట్టినందున ఎంతో అనుకూలమైన పరిస్థితులున్నాయి. కానీ మన మెట్రోస్టేషన్లు, అక్కడి స్టేషన్లను గమనిస్తే అక్కడ స్టేషన్లకు ఎక్కువ మొత్తంలో స్థలం కన్పిస్తోంది. నగరంలో తక్కువ స్థలంలో ఒకే ఒక్క పిల్లర్‌పై స్టేషన్లను అరుదైన డిజైన్లతో నిర్మిస్తోంది ఎల్ అండ్ టి. నగరంలో మెట్రో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ వయోడక్ట్‌ల నిర్మాణం కోసం కారిడార్‌కు ఒకటి చొప్పున యార్డులను నిర్మించగా, చెన్నైలో ప్రస్తుతం కొయంబెడ్, మీనంబాకం ప్రాంతాల్లో రెండు యార్డులను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రోరైలు
పిపిపి పద్ధతిలో పనులు, డిఎంఆర్సీతో డిపిఆర్, మూడు కారిడార్లు 72కి.మీ.లు, 66 స్టేషన్లు, ఎలివేటెడ్ విధానంతో పనులు, మూడు డిపోలు, ప్రాజెక్టు కోసం 269 ఎకరాల స్థలం కేటాయింపు, ప్రాజెక్టు విలువ రూ. 14,132 కోట్లు, ఇందులో పదిశాతం నిధులు కేంద్రం ఇవ్వగా, తొంభై శాతం నిధులు ఎల్ అండ్ టి, ఎంఆర్‌హెచ్‌ఎల్, రూ. 1980 కోట్లను స్థల సేకరణ, రోడ్డు విస్తరణ, వౌలిక వసతుల బదిలీ వంటి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వయోడక్ట్ నిర్మాణం, సెగ్మంటల్ గిడ్డర్ (ఫ్రీ కాస్ట్), స్టేషన్లను సింగిల్ పిల్లర్ కాంటిలివర్, ట్రాక్ గేజ్ 1345ఎంఎం, 25 కె.వి ఏసి కరెంటు సరఫరా, త్రీ కార్ ట్రెయిన్‌ను సిక్స్ కార్ ట్రెయిన్‌గా విస్తరణ, త్రీకార్ ట్రెయిన్ వెయ్యి మంది ప్రయాణికులను తీసుకెళ్లగా, సిక్స్ కార్ ట్రెయిన్ రెండు వేల మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. రాలింగ్ స్టాక్ సప్లయిర్లుగా హ్యూందయ్, రోటమ్, సౌత్ కొరియా. మొత్తం 171 కార్లను తయారుచేసి సప్లై చేసే బాధ్యతలు సదరు సంస్థలకు అప్పగించారు. గరిష్ట వేగం 90 కెఎంపిహెచ్, గరిష్టంగా 80 కెఎంపిహెచ్, సగటు వేగం 34 కెఎంపిహెచ్, స్టేషన్‌లో 20 సెకన్ల పాటు నిలిచే విధంగా ఏర్పాట్లు, డ్రైవర్ లేకుండా నడిచే ఈ రైళ్లన్నీ ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (వోసిసి) ద్వారా రాకపోకలు సాగిస్తాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (సిబిటిసి) వ్యవస్థతో సిగ్నలింగ్ వ్యవస్థ. ఇది దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మెట్రోలో అందుబాటులోకి రానుంది. టికెట్ల జారీ స్మార్ట్‌కార్డు, టోకెన్, ఎన్‌ఎఫ్‌సి కొత్త టికెట్ విధానం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును 2017లో పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, క్షేత్రస్థాయిలో తలెత్తిన పలు అడ్డంకుల కారణంగా పనులు పూర్తయ్యేందుకు కాస్త ఆలస్యమయ్యేలా ఉంది.
చెన్నై మెట్రోరైలు
చెన్నై ప్రజలకు ఇప్పటికే పది కిలోమీటర్ల పొడువునా మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చారు. చెన్నై మెట్రో పనులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో స్థానిక ప్రభుత్వం చేపట్టింది. రెండు కారిడార్లుగా మొత్తం 45 కిలోమీటర్లు నిర్మాణ పనులు చేపట్టగా ఇందులో ఎలివేటెడ్ కారిడార్లను 21 కిలోమీరట్ల పొడువు కాగా, మిగిలిన మరో 24 కిలోమీటర్ల పొడువున అండర్‌గ్రౌండ్ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. మొత్తం 32 స్టేషన్లు కాగా, వీటిలో అండర్‌గ్రౌండ్‌లో 20, మిగిలిన 12 ఎలివేటెడ్ స్టేషన్లు. జూన్ 2009లో ప్రారంభమైన పనులు. ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 14,750 కోట్లు కాగా, అందులో 41 శాతం కేంద్ర ప్రభుత్వం, అలాగే, 59 శాతం నిధులు స్థానిక ప్రభుత్వం జైకా (జపాన్) నుంచి రుణంగా తీసుకుంది. వయోడక్ట్ నిర్మాణానికి సెగ్మెంట్ బాక్స్ గిడ్డర్ విధానాన్ని వినియోగించనున్నారు. స్టేషన్ల డిజైనింగ్ కోసం కనె్వన్షనల్ పోర్టల్ స్టేషన్ల విధానం, చెన్నై మెట్రో కూడా 25కెవి ఏసి కరెంటుతో రైళ్లను నడపడంతో పాటు కరెంటు ట్రెయిన్‌లో ఎక్కడైనా నిల్చిపోయినా, దాన్ని లాక్కొని తెచ్చేందుకు డీజిల్ ట్రెయిన్లను అందుబాటులోకి ఉన్నాయి. చెన్నై మెట్రో మాత్రం 4 కార్ ట్రెయిన్ విధానాన్ని 6 కార్ ట్రెయిన్ విధానంగా విస్తరించుకునే వెసులుబాటు కల్పించుకుంది. 4 కార్ ట్రెయిన్ అయితే 1276 మంది ప్రయాణికులు ఒకే సారి ప్రయాణించే వీలు ఉండగా, దాన్ని 6 కార్‌కు విస్తరించుకుంటే ఒకేసారి 1914 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. దీనికి రోలింగ్ స్టాక్ సప్లయిదార్లుగా ఆల్‌స్టమ్, ఫ్రాన్స్ కొన్ని సరఫరా చేయగా, కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌లోని సిరి సిటీ పంపిణీ చేస్తుంది. గరిష్టంగా 90 కెఎంపిహెచ్ వేగంగా నిర్ణయించగా, 34 కెఎంపిహెచ్ వేగాన్ని సగటు వేగంగా నిర్ణయించారు. ప్రతి రైలు స్టేషన్‌లో 30 సెకన్లు ఆగేలా, ఇక ముఖ్యమైన ప్రక్రియ ఏమిటంటే హైదరాబాద్ మెట్రో డ్రైవర్ లేకుండా నడపేందుకు సిద్ధం కాగా, చెన్నై మెట్రో మాత్రం డ్రైవర్‌తోనే నడుస్తోంది. చెన్నై మెట్రో కూడా కోయంబెడు, ఆలందర్, చెన్నై సెంట్రల్‌లలో మూడు రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంది. డిస్టెన్స్ టు గో (డిటిజి) ద్వారా ఇక సిగ్నలింగ్ వ్యవస్థ నడుస్తోంది. 2009 జూన్‌లో పనుల ప్రారంభమై గత జూన్ 29 నుంచి పదికిలోమీటర్ల కారిడార్ అందుబాటులో రావటంతో చెన్నైలో మెట్రో కూత విన్పిస్తోంది.
పైగా ప్రస్తుతం ప్రతిపాదించిన 45 కిలోమీటర్లలో 35 కిలోమీటర్ల కారిడార్ పనులు వేగంగా చేపడుతూనే, భవిష్యత్తులో మెట్రోను మరింత విస్తరించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

తుది దశలో
గ్లోబల్ సమ్మిట్ పనులు
* రూ. 45.63 కోట్లతో వంద పనులు
* పూర్తయిన పనులు 50 శాతమే
* 28న ఉదయం వరకు గడువు
* ఐనా.. ప్రారంభించని పనుల రద్దుకు ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 22: నగరంలో ఈనెల 28న జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు వేదిక కానున్న హైటెక్స్‌కు వెళ్లే దారుల్లో జిహెచ్‌ఎంసి చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. బిటి రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల మెరుగు లేన్ మార్కింగ్, జంక్షన్ల అభివృద్ధి, గార్డెనింగ్, పెయింటింగ్, లైటింగ్ వంటి పనుల కోసం రూ. 45.63 కోట్లతో వంద పనులను ప్రతిపాదించారు. ఇందులో రూ. 68లక్షల విలువైన మూడు పనులను జిహెచ్‌ఎంసి అధికారులు రద్దు చేశారు. సమ్మిట్‌కు వేదిక కానున్న హైటెక్స్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ పనులను చేపట్టారు. ఇందులోనూ మొత్తం పనుల్లో యాభై శాతం పనులను వెస్ట్‌జోన్‌లోనే చేస్తున్నారు. ఈ పనులన్నీ ఈ నెల 28వ తేదీ ఉదయం కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన బల్దియా అప్పటికీ పూర్తికానీ, ప్రారంభించని పనులను నిలిపివేయాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక, ప్రదాని నరేంద్రమోదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పలువురు ప్రముఖులు హజరవుతున్నందున ఈ ఏర్పాట్లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టాయి. ఈ పనులను గోల్కొండ, ఆరంఘర్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పనులను చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏయిర్‌పోర్టు నుంచి హైటెక్స్ వరకు, అక్కడి నుంచి పలు చారిత్రాత్మక కట్టడాలు, పాతబస్తీలోని ఫలక్‌నుమా వంటి ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పునఃనిర్మాణం పనులకు రూ. 28 కోట్లను కేటాయించారు. ఫుట్‌పాత్‌లను మెరుగుపరిచే పనుల కోసం రూ. 21.39 కోట్లు, లేన్ మార్కింగ్‌కు రూ. 3.13 కోట్లను కేటాయించి పనులను ముమ్మరం చేశారు. సమ్మిట్ సందర్భంగా చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు యాభై శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా ఈనెల 28 ఉదయం కల్లా పూర్తి చేయాలని, అప్పటికీ ప్రారంభించని పనులు, పూర్తికానీ పనులను సైతం నిలిపివేయాలని ఆదేశించినట్లు చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్ తెలిపారు. కొద్ది నెలల క్రితం నగరంలో అతి భారీ వర్షాలు కురవటంతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, హైటెక్స్ వైపు వెళ్లే రూట్‌లో కొత్తగా రోడ్లు వేయటం వంటి పనులపైనే అధికారులు ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూన్,జూలై మాసాల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రూ. 20 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వర్షాలకు 335 చోట్ల రోడ్లు పాడైనట్లు గుర్తించిన అధికారులు రూ. 72 కోట్ల వ్యయంతో పనులుచేపట్టారు. వీటిలో సగం పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

అంతర్ రాష్ట్ర
దొంగల ముఠా అరెస్టు
రూ. 43 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం
గచ్చిబౌలి, నవంబర్ 22: ఏడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో మహిళ సహా నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుండి ఒక పిస్టల్ ఆరు రౌండ్లు, 43 లక్షల విలువ చేసే బంగారం ఆభరణలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి మహేష్ భగత్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఆరుగురు నిందితుల్లో నలుగుర్ని అరెస్టు చేసినట్లు.. ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నట్లు తెపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శైలేందర్ విశ్వ కర్మ (36) ఎండి జాహిద్ (30) సైయ్యద్ సాజీద్ ఆలీ (38) అర్చన అమ్రజీత్ బాగడే (24) పవన్ వర్మ, అనూప్ సింగ్ (30)లు ముఠాగా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారని సిపి తెలిపారు. అయితే, పవన్ వర్మ, అనూప్ సింగ్‌లు పరారీలో ఉన్నారని వారి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. నిందితులు టెక్నాలజీ ఉపయోగించుకుని దొంగనాలు చేసేవారని, ఎక్కువగా సంపన్నుల నివాసాలను లక్ష్యం చేసుకుని దొంగతనాలు చేసేవారన్నారు. రాజస్థాన్ మధ్యప్రదేశ్, గుజరాత్, మహరాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కలిపి 28 దొంగతనాలు చేసినట్లు సిపి వివరించారు. గూగుల్ మ్యాప్ సహాయంతో సంపన్నుల ఇళ్లను గుర్తించి అనంతరం పథకం ప్రకారం దొంగతనం చేసి రాష్ట్రాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోయేవారు. ఎంచుకున్న ఇంటికి కారులో వెళ్తారని.. ముందు విశ్వకర్మ ఫోన్‌లో మాట్లాడుకుంటూ.. లోపలికి ప్రవేశిస్తారని అనంతరం మిగిలిన వారు బంధువుల మాదిరిగిగా వచ్చి తాళాలు పగలగొట్టి పని ముగించుకుని వెళ్లేవారు. విశ్వకర్మ, జాహిద్‌లు 2005 నుండి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారని అయితే, 2006లో మధ్యప్రదేశ్ కోర్టు 58 ఇళ్లలో దొంగతనం చేసిన కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే రెండు సంవత్సరాల అనంతరం బెయిల్‌పై వచ్చిన తరువాత ఆరుగురు ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న సమయంలో ఆర్చన పూణేలో స్పాలో పరిచయమైంది. అప్పటి నుండి వీరితో కలసి చోరీలు చేస్తున్నట్లు వివరించారు. నిందితుల నుండి 9ఎంఎం పిస్టల్, ఆరు రౌండ్లు బుల్లెట్లు, కిలో 250 గ్రాములు బంగారం, 1066 గ్రాములు వెండి, ఆల్టో, ఇండికా కార్లను ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. పవన్ వర్మ, అనూప్ సింగ్‌లు అచూకీ లభిస్తే మరికొంత బంగారం రికవరీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసిన ఎల్‌బి నగర్ జోన్ సీసీఎస్ పోలీసులకు క్యాష్ రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్లు, డిసిపి క్రైం నాగరాజు, ఏసీపీ క్రైం శ్రీనివాస్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

భాషకు మూలస్థానం తెలంగాణ
కాచిగూడ, నవంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలుగు ప్రపంచ మహసభలు ప్రపంచ దేశాలకు నాంది కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిధారెడ్డి అకాక్షించారు. తెలుగు మహసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం తెలంగాణ 31 జిల్లాలలోని తెలుగు ఉపాధ్యాయులతో సమావేశం బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలంటే ప్రపంచ మహాసభలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ ద్వారా భాష పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. భాషకు మూలస్థానం తెలంగాణనే కారణమని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మహసభలను నడిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వివిధ దేశాల నుంచి ఆరువేలు, రాష్ట్రాల నుంచి 1500 వందలు, తెలంగాణ నుంచి ఆరువేల మంది కవులు, కళాకారులు పాల్గొంటున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రపంచ సభలకు భారత రాష్టప్రతి, ఉప రాష్టప్రతిని ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ కార్యదర్శి ఐఏఎస్ బుర్రా వేంకటేశం మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. మాతృభాషలో నిరక్షరాసులు ఉండడం శోచనీయమని అన్నారు. వివిధ దేశాలు కూడా తమ మాతృ భాషలోనే చదువుకుంటారని, తెలుగు భాషను పూర్తిగా మారిచి పోతున్నారని పేర్కొన్నారు. తెలుగు మహసభల్లో అధ్యాపకులు బాధ్యతయుతంగా వ్యవహరించి మహసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కేసీఆర్ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

గడువులోగా రికార్డుల ప్రక్షాళన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 22: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా సూచించారు. బుధవారం సచివాలం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా వాకటి కరుణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పురోగతిపై సమీక్షించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. సర్వే నిర్వహణలో నాణ్యత లోపించకుండా చూడాలని పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సరిగా నమోదు చేయడమే కాకుండా పహాణితో సరిచూసుకోవాలని సూచించారు. భూముల వివరాల బేసిక్ డాటాను సరిగా నమోదు చేయాలని వివరించారు. వక్ఫ్, ఆటవీ భూములకు సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేసి వాటిని సంరక్షించాలని అన్నారు. క్లిష్టమైన కేసులకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఖాళీగా ఉన్న వక్ఫ్ భూములను ఏదైనా గుర్తించినట్లయితే వాటిని కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూ ప్రక్షాళనలో భాగంగా అప్‌డేట్ చేసిన రికార్డులను సరిగ్గా అప్‌డేట్ చేశామా లేదా అని విశే్లశించాలని సూచించారు. వివాదాస్పద ఆటవీ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. నోటీఫైడ్ భూముల వివరాలను స్వాధీనం చేసుకున్న (అక్వాయిడ్) భూముల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, డీఎఫ్‌ఓ వినోద్ పాల్గొన్నారు.
మహిళల రక్షణకు కేంద్రం చేయూత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 22: మహానగరంలో మహిళల భద్రత కోసం చర్యలు మరింత కట్టుదిట్టం కానున్నాయి. ముఖ్యంగా జనసంచారమెక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళల రక్షణ అనే పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర హోం శాఖ సన్నాహాలు చేస్తోంది. నిర్భయ చట్టం అమలుకు కేటాయించిన ప్రత్యేక నిధుల నుంచి ఈ పథకానికి కేంద్రం నిధులను సమకూర్చనుంది. తొలి దశగా దేశంలోని దిల్లీ, కోల్‌కత్త, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, లక్నోలతో పాటు మన నగరంలో కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు దిల్లీల్లో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేస్‌లో మహిళల భద్రత అనే ఈ కార్యక్రమం అమలుకు ప్రణాళిక, విధి విధానాలు రూపొందించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, నగర పోలీసు అదనపు కమిషనర్ స్వాతిలక్రా హాజరయ్యారు. షీ టీమ్స్ ఏర్పాటు, సీసీ కెమెరాలను విస్త్రృత స్థాయిలో అమర్చటం, బస్సులోనూ మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టినందున హైదరాబాద్ నగరం మహిళల రక్షణ విషయంలో ఆదర్శనంగా ఉందని వివరించారు. పబ్లిక్ ప్లేస్‌లలో మహిళల భద్రత అంశంపై నెలరోజుల్లోగా స్పష్టమైన ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాలని, ఈ నివేదికల ఆధారంగా తగు నిధులను మంజూరు చేస్తామని అధికారులకు కేంద్ర ప్రభుత్వం అధికారులు స్పష్టం చేశారు.

నెలాఖరులోగా పెన్షన్ల తనిఖీ పూర్తి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 22: జిల్లాలో ఆసరా పెన్షన్లను తీసుకున్న లబ్దిదారుల ఇంటింటి తనిఖీ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. ఇంతవరకు పూర్తయిన తనిఖీల వివరాలపై బుధవారం కలెక్టరేట్‌లో డిఆర్‌ఓ సరళావందనం, స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ శ్రీ వత్స కోట, ఆర్డీఓ చంద్రకళతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇటీవల బండ్లగూడ మండలంలో వెలుగుచూసిన పెన్షన్ అక్రమాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లోని మొత్తం లక్షా 25వేల 521 మంది లబ్దిదారుల వివరాలను ఐడిప్రూఫ్, డెత్ సర్ట్ఫికెట్లు, వయస్సు నిర్థారణ సర్ట్ఫికెట్, ఆధార్ కార్డులు మొదలైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసి ఇంటింటికీ తనిఖీ నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలా వారీగా తనిఖీ ప్రక్రియను సమీక్షిస్తూ చార్మినార్ మండలంలో అతి తక్కువ తనిఖీలు జరిగాయని, తహశిల్దార్ ప్రత్యేక చొరవ తీసుకుని నిర్ణీత వ్యవధిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అధిక సంఖ్యలో తనిఖీలు చేయాలని విఆర్‌ఓ,విఆర్‌ఏలను ఆదేశిస్తూ, ఒక రోజు ముందుగానే ఆయా బస్తీల్లో తగు ప్రచారం నిర్వహించి, వారందరికి ఐడి ప్రూఫ్‌లు ఓరిజినల్‌తో హాజరయ్యేలా చూడాలని అన్నారు. తనిఖీ చేయని పెన్షన్‌దార్లు నేరుగా ఆ ఏరియాకు చెందిన తహశీల్ కార్యలయాలంలో తనిఖీ తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. తనిఖీ సమయంలో పెన్షన్ దారుడి ఫోన్ నెంబర్, ఆధార్ తప్పనిసరిగా సేకరించాలని అన్నారు. తనిఖీ ప్రక్రియలో ఏవైనా సందేహాలుంటే వెంటనే పై అధికారులకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనం మాట్లాడుతూ తనిఖీ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ చంద్రకళ మాట్లాడుతూ మండలాల వారీగా తనిఖీలకు క్షేత్ర స్థాయి ఎదురవుతున్న సమస్యలను తహశిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ ప్రక్రియ క్షేత్ర స్థాయిలోనే చేయాలని ఆదేశించారు.

ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
కాచిగూడ, నవంబర్ 22: రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వమే మరోసారి లెక్కలేని వాస్తవాలను ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణలో 2.8లక్షల ఉద్యోగాలు ఉన్నాయనీ, రాష్ట్ర జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అనాడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రోజుకో లెక్క చెబుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ వివరాలతో ప్రభుత్వం వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని కోరారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాల సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమ సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడోవంతు జనాభా యువతేనని, అందరికి బతుకుదెరువు చూపడం సర్కారు బాధ్యతని చెప్పారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనీ, కానీ ప్రభుత్వం మాత్రం లక్షా ఏడువేల ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. యూపీ ఎస్సీ మాదిరిగా తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, కాంట్రాక్టులు ఉద్యోగులకు మధ్య తగదా పెడుతుందని అన్నారు. తెలంగాణలో కంపెనీల్లో ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారో ప్రకటించాలని కోరారు. రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు రూ 16వేల కోట్లు సరిపోతాయనీ, కానీ ప్రభుత్వం రూ 47వేల కోట్లు ఖర్చు చేస్తుందని విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు సర్కారు ప్రయత్నిస్తుందన్నారు. ఉద్యోగాల సాధన సమితి చైర్మెన్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర రావు మాట్లాడుతూ..ప్రభుత్వం ఖాళీలన్నింటిని విడితల వారిగా కాకుండా ఒకేసారి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం మనిషి సామాజిక పరివర్తన, జీవిత మార్పు తీసుకొస్తుందని తెలిపారు. తెలంగాణ మూత పడ్డ పరిశ్రమలను వెంటనే తెరిపించాలన్నారు. ఎసీ ఎస్టీ బిసిలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పురుషోత్తం, విజయ్, విప్లవ కుమార్, పుల్లయ్య, అనిల్, రాములు, శైలజ పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల హక్కు

వికారాబాద్, నవంబర్ 22: విద్యార్థులకిచ్చే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని రాజ్యాంగ హక్కు అని ఏబీవీపీ నగర కార్యదర్శి మనోజ్ అన్నారు. బుధవారం జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మనోజ్ మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. దీని కారణంగా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకునే విద్యార్థులు చదువు ఆపేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమని సీఎం కేసీఆర్‌కు తెలిసినా విద్యార్థులను చిన్నచూపు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ ఖచ్చితంగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నగర ఉపాధ్యక్షుడు మధు, జాయింట్ సెక్రటరి ప్రకాష్ పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి లక్ష్య సాధనకు కృషి చేయాలి

వికారాబాద్, నవంబర్ 22: ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా విశ్రాంత ప్రాంతీయ పర్యవేక్షణాధికారి తూడి హన్మంత్‌రెడ్డి సూచించారు. బుధవారం నవాబ్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ప్రేరణ జ్ఞానయజ్ఞం నిర్వహించారు. ఈసందర్భంగా హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించినపుడే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్నందున విద్యార్థులు గర్వపడాలని చెప్పారు. ఇక్కడ బోధించేవారు ఎంతో నైపుణ్యం, బోధనానుభవం కలిగి ఉంటారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇక్కడ చదివే విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలడని తెలిపారు. దయ, జాలి, క్రమశిక్షణ, ఏకాగ్రత, గురుభక్తి వంటి లక్షణాలు ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారికే ఉంటాయని అభిప్రాయపడ్డారు. లక్షలాది రూపాయలు వెచ్చించి తల్లిండ్రులు పిల్లల్ని కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నా, ఒత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు. వినయం, విధేయత, పోటీతత్వం ఇక్కడి విద్యార్థులకే అలవడతాయని అన్నారు. ఆంగ్లం నేర్చుకునేందుకు మెళకువలను విద్యార్థులకు చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వెంకటయ్య, జీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్వరస్వామి, అధ్యాపకులు వసంత, బంద్యా, నాగేశ్వరరావు, రమేష్, ఉషారాణి, రవీంద్రనాయక్, డాకేశ్వర్, గోపాల్, సత్యనారాయణ, నవాబ్‌పేట, పుల్‌మామిడి, ఎల్లకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీ్ధర్‌రెడ్డి, పాండు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు నిర్మల, శ్రీనివాస్, కళాశాల జూనియర్ అసిస్టెంట్ శ్రీలేఖ, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

పంచలోహ శంఖం
విక్రయానికి యత్నం

ఎనిమిది మంది అరెస్టు
గచ్చిబౌలి, నవంబర్ 22: కోటి రూపాయల విలువ చేసే పంచలోహ శంఖాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఎనిమిది నిందితులను రాచకొండ ఎస్ ఓటి పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. పేట్‌బషీరాబాద్‌లోని సూచిత్ర ప్రాంతంలో నివాసముంటున్న బస్వరాజ్ అలియాస్ ముకుందం బస్వరాజ్(75), కూకట్‌పల్లిలోని బాలజీ నగర్‌లో నివాసముండే మద్దిరిసోమ శేఖర్‌రెడ్డి(48), సరూర్‌నగర్‌కు చెందిన డేవిడ్ చంద్రశేఖర్(42), బాషీర్‌బాగ్‌కు చేందిన నోముల లక్ష్మికాంత్(42), వెస్ట్‌మారేడుపల్లిలో నివాసముండే గంజి మురళీధర్(54), బేగంబజార్‌కి చెందిన దీపాల గణేష్(34), కాచిగూడలో నివాసముండే దినేష్ కుమార్(43) మెహదీపట్నంలో నివాసముంటున్న సందిపట్ల ప్రణేంద్రనాథ్(54).. కోటి రూపాయల విలువ చేసే శంఖాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు కొనుగులు చేసే వారిలా వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిమలు కలిగిన అతి పురాతనమైన శంఖమని నమ్మించి విక్రయించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. శంఖం ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే ప్రధాన సూత్రధారి ముకుందం బస్వరాజ్ మాత్రం తనకు ఒక వ్యక్తి దానం చేసినట్లు చెప్తున్నాడని తెలిపారు. ఇంత ఖరీదైన పంచలోహ శంఖాన్ని ఉచితంగా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. శంఖం ప్రముఖ దేవాలయానికి సంబందించినదై ఉండవచ్చని అభిప్రాయా పడ్డారు. ఏ దేవాలయానికి సంబంధించిన శంఖం దొంగిలించ బడిందా తెలియాల్సి ఉందని తెలిపారు. ముఠా సభ్యులు గతంలో ఎపుడైన ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే విషయంపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుండి ఒక శంఖం, స్విఫ్ట్, క్వాలీస్ కార్లను, ఏడు సెల్‌ఫోన్లు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎస్‌ఓటి పోలీసులకు కమిషనర్ క్యాష్ రివార్డులు అందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ నాగరాజు, ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ రఫిక్, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

పీఈటీ కొట్టాడని.. పారిపోయన విద్యార్థులు
కొత్తూరు, నవంబర్ 22: విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు కొట్టడంతో భయంలో విద్యార్థులు పారిపోయారు. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి 24గంటల తరువాత విద్యార్థులు తిరిగి వచ్చిన సంఘటన కొత్తూరు మండల పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం నవంబర్ 21వ తేది ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఫాతిమా హైస్కూల్ పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు శేఖర్.. 8వ తరగతి చదువుతున్న అజిస్, దేవిశ్రీప్రసాద్, ప్రవీణ్, మధుసూదన్ గౌడ్‌తో భయంతో పారిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మధుసూదన్‌గౌడ్ తల్లిదండ్రులు వివరించారు. మంగళవారం షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో అనంతపుర్ వెళ్తున్న రైలు ఎక్కి వెళ్లిపోయారు. నంద్యాల చేరుకున్న తరువాత తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో విద్యార్థులు అక్కడి నుండి వెనుతిరిగి బుధవారం ఉదయం కొత్తూరుకు చేరుకున్నారు. కొత్తూరు సమీపంలోని గిరిజన తండాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విద్యార్థుల గమనించిన గిరిజనులు.. కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాతను వివరణ కొరగా పాఠశాలలో ఇద్దరి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరువురిని క్రమశిక్షణతో భాగంగానే మందలించామే తప్పా ఎవరినీ కొట్టలేదని తెలిపారు. తల్లిదండ్రుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు భయంతోనే పారిపోయారని కొత్తూరు ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్ వివరించారు. తిరిగి వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.

ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్, నవంబర్, 22 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏడు దేశాలకు చెందిన విదేశి కరెన్సీని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేయడానికి యత్నించిన ప్రయత్నాన్ని ఇంటలిజెన్స్, దక్షిణ మండల టాస్క్‌పోర్సు అధికారులు అడ్డుకట్ట వేశారు. కస్టమ్స్ ప్రధాన కమిషనర్ అనిల్ కుమార్‌జైన్, దక్షిణ మండల టాస్క్ఫోర్ అడిషనల్ డీసీపీ చైతన్య కుమార్ బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో విలేఖరుల సమావేశంలో ఈ సంఘటనకు సబంధించిన వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఎమిరెట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే-525 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతని వద్ద వున్న మూడు లగేజీలను చెక్ ఇన్‌లో వేశాడు. బోర్డింగ్ పాస్ తీసుకోని ఇమిగ్రేషన్ తనిఖీలు దాటి వచ్చినట్లు తెలిపారు. కస్టమ్స్ వద్ద ఎలాంటి డిక్లేరేషన్ కూడా సమర్పించలేదు. ముందస్తు సమాచారం ఉన్న హైదరాబాద్ దక్షిణ మండల టాస్స్