హైదరాబాద్

పంచ్ కొట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: మహానగరంలో కోటి మందికి అవసరమైన అత్యవసర సేవలు, పౌరసేవలను అందిస్తున్న జీహెచ్‌ఎంసీ పాలన, అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత చోటుచేసుకోనుంది. ఇందులో విధులు నిర్వర్తించే అత్యున్నతమైన హోదా కమిషనర్ మొదలుకుని క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య విధులు నిర్వర్తించే కామాటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సాధ్యాసధ్యాలపై ఉన్నతాధికారులు కసరత్తును ప్రారంభించారు. ఇప్పటి వరకు ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులైన పారిశుద్ద్య కార్మికులకే పరిమితమైన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ఇకపై అన్ని క్యాటగిరీల అధికారులు, సిబ్బందికి సైతం అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమైంది. ఈ మేరకు రెండురోజుల క్రితం జరిగిన ఉన్నతాధికారులు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేగాక, రానున్న పదిహేను రోజుల్లో ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేసేందుకు బల్దియా సిద్దమైంది. పూర్వ కమిషనర్ సోమేశ్‌కుమార్ హయాంలో సర్కిల్ 9లో కార్మికులు లేకున్నా, వారు పనిచేసినట్లు రికార్డులు సృష్టించి, వారి పేరిట సూపర్‌వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు జీతాలను డ్రా చేసుకుంటున్న కుంభకోణం వెలుగుచూడటంతో ఆయన అప్పట్లో సర్కిల్ 9లో ప్రయోగాత్మకంగా ఈ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో పారిశుద్ద్య విభాగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు బ్రేక్ పడి, నెలకు సుమారు నాలుగున్నర కోట్ల మేరకు జీహెచ్‌ఎంసీ నిధులు ఆదా అవుతున్నాయి. అయినా అడపా దడపా చిన్న చిన్న అక్రమాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. బల్దియాలో కొందరు పర్మినెంటు ఉద్యోగులు తమ స్థానంలో ఇతరులను నియమించి, నామమాత్రంగా జీతాలు చెల్లిస్తూ, వారు ఇతర విధులు నిర్వర్తిస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. అంతేగాక, కొందరు పర్మిమెంటు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది విభాగాధిపతులను మెయింటేన్ చేసుకుని ఉదయం సంతకాలు పెట్టి, ఆ తర్వాత బయట ప్రైవేటు వ్యవహారాలు చూసుకుంటున్నట్లు కూడా సమాచారం రావటంతో అందరికీ ఒకే రకమైన బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు బల్దియా సిద్దమైంది. దీనికి తోడు ఇటీవలే అందరికీ ఒకేరకమైన డ్రెస్ కోడ్‌ను అమలు చేసిన కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉద్యోగులు, అధికారుల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్న విషయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఒకే సర్కిల్‌లో ఒక్కోరోజు ఒక్కో చోట క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే కొందరు కింది స్థాయి ఉద్యోగులకు మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు సాధ్యపడే అవకాశాల్లేవు. అయితే ఇలాంటి వారికి మినహాయింపునివ్వాలా? లేక వారు పనిచేస్తున్న చోటకు వెళ్లి మ్యానువల్‌గా అటెండెన్స్ తీసుకోవాలా? అన్న విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.