హైదరాబాద్

మెరుగైన నైట్ స్వీపింగ్ యంత్రాల పనితీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: అర్థరాత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మెయిన్‌రోడ్లను ఊడుస్తూ ప్రమాదాలబారిన పడి మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బల్దియా నైట్ స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 43 స్వీపింగ్ మిషన్లున్నాయి. వీటి పనితీరుపై గతంలో అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటి పనితీరులో పారదర్శకత సాధించేందుకు కమిషనర్ ప్రవేశపెట్టిన సోషల్ ఆడిటింగ్, పనితీరుపై నిరంతర తనిఖీలు వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి.
దేశంలో స్వీపింగ్ మిషన్లను వినియోగిస్తున్న అతి తక్కు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లోని రోడ్లను శుభ్రపరిచేందుకు వీటిని వినియోగిస్తున్నారు. మొత్తం 43 స్వీపింగ్ మిషన్లలో ఒక్కో స్వీపింగ్ మిషన్ రోజుకి కనీసం 60 లైన్ కిలోమీటర్ల స్వీపింగ్ చేయాల్సి ఉంది. నగరంలో సీసీ, బీటీ రోడ్ల మొత్తం సుమారు 9వేల కిలోమీటర్ల పొడువున ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ వద్దనున్న మిషన్లు రోజుకి 19 వంద కిలోమీటర్ల మేరకు శుభ్రపర్చాల్సి ఉంది. కాంట్రాక్టు పద్దతిన వినియోగిస్తున్న ఈ మిషన్ల వినియోగంలో అక్రమాలను అరికట్టేందుకు, పనితీరును మెరుగుపరిచేందుకు కమిషనర్ చేపట్టిన చర్యల్లో భాగంగానే సోషల్ ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రతి డిప్యూటీ కమిషనర్ ఒక్కో స్వీపింగ్ యంత్రానికి ఓ ఎస్‌ఎఫ్‌ఏను నియమించిన ఒప్పందం ప్రకారం మిషన్లు పనిచేస్తున్నాయా? అన్న విషయంపై తనిఖీలు చేయించాలని ఆదేశించారు. అలాగే మిషన్లకు ముందు వెనకాల భాగంలో ఉండే బ్రష్‌లు రోడ్డుకు సక్రమంగా అనుకుని, స్వీపింగ్ చేస్తున్నాయా? లేదా?అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. స్వీపింగ్ బ్రెష్‌లను కనీసం వారానికోసారి, లేక అంతకన్నా ముందే మార్చేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మిషన్ల ట్రాకింగ్ విధానం విధిగా ఉండేలా చర్యలు చేపడుతూ, వీటి పనితీరును మెరుగుపరిచేందుకు సోషల్ ఆడిట్ విధానాన్ని అమలు చేశారు. ఈ మిషన్ ఎక్కడెక్కడ పనిచేసింది? ఏ ఏ ప్రాంతాల్లో స్వీపింగ్ పనులు చేపట్టిందన్న అంశాన్ని కనీసం నలుగురు పౌరులు ధృవీకరిస్తూ సంతకాలు తీసుకోవాలన్న నిబంధనను కూడా పెట్టడంతో వీటి పనితీరు గతంలో కన్నా గణనీయంగా మెరుగుపడిందని చెప్పవచ్చు. గతంలో కేవలం 30 కిలోమీటర్ల లోపే పనిచేసే ఈ మిషన్లను ప్రస్తుతం 50 లేన్ కిలోమీటర్ల మేరకు స్వీపింగ్ చేసేలా పనితీరును మెరుగుపర్చారు.
ప్రస్తుతం ప్రతిరోజు తనిఖీలు చేయటం వల్ల పది రోజులకు ఒ సారి వీటిని మారుస్తున్నారు. తద్వారా స్వీపింగ్ పటిష్టంగా కొనసాగటంతో పాటు స్వీపింగ్ మిషన్ల పనితీరుపై జారీ చేసిన మార్గదర్శకాలు సైతం సక్రమంగా అమలవుతున్నాయి.