హైదరాబాద్

త్వరితగతిన పింఛన్ల స్కూృటినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: పెన్షన్ల వెరిఫికేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు తనిఖీ పూర్తయిన వాటి వివరాలను నిర్ణీత ఫ్రొఫార్మాలో తమకు పంపాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె గురువారం కలెక్టరేట్‌లో జేసీ ప్రశాంతి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనంతో కలిసి పెన్షన్ల తనిఖీ, ల్యాండ్‌బ్యాంక్, కోర్టు కేసులు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ల వెరిఫికేషన్ డోర్ టు డోర్ తనిఖీ చేసిన కేసులు ఎన్ని? ఇంకా వెరిఫికేషన్ చేయాల్సినవి ఎన్ని? అని అధికారులను ప్రశ్నించారు. వీటితో పాటు వెరిఫికేషన్ చేసిన వాటిల్లో గుర్తించలేనవి అన్న నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలు పంపాలని ఆదేశించారు. ముఖ్యంగా గుర్తించలేని కేసుల విషయంలో తాము వెరిఫికేషన్ కోసం ఇంటికి వెళ్లినపుడు, అక్కడ ఎవరు లేరని, అసలైన పెన్షదార్లు 15 రోజుల్లో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి సంబంధిత డాక్యుమెంట్లతో ధృవీకరించుకోవాలన్న విషయాన్ని లబ్ధిదారులకు తెలిజేయాలన్నారు. అందుకు అవసరమైన నోటీసును కూడా అంటించాలన్నారు. క్షేత్రస్థాయి పెన్షన్ల వెరిఫికేషన్ చేసేటపుడు ఆ ప్రాంతంలో రెగ్యులరైజేషన్ కింద రావల్సిన బాకీల మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ల్యాండ్‌బ్యాంక్‌ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు గుర్తించిన ల్యాండ్ పార్శిళ్ల స్కెట్‌లు, సరిహద్దులు వంటి పూర్తి వివరాలను వెంటనే పంపాలని ఆదేశించారు. అదే విధంగా మండలా వారీగా తిరస్కరించిన ఎన్‌ఓసీ కేసులు, రెగ్యులరైజేషన్, లిటిగేషన్ ఖాళీ భూముల వివరాలను పంపాలని ఆదేశించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి దరఖాస్తుల పరిశీలనకు సంబంధిత వీఆర్‌ఓలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా చిన్న మండలాల్లో తక్కువ కేసులు ఉంటాయని సంబంధిత తహశీల్దార్‌లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే త్వరగా పూర్తి చేయవచ్చునని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు నిర్మించే ప్రక్రియలో భాగంగా అనువైన ప్రభుత్వ స్థలాలను కేటాయించాల్సి ఉందని, ఇప్పటి వరకు 50 స్థలాలు గుర్తించామని, మరో యాభై స్థలాలను గుర్తించేందుకు తహశీల్దార్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
అధిక సంఖ్యలో
హాజరయ్యేలా చూడాలి
ఈ నెల 15 నుంచి 19వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగువారు ఎక్కువ మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్ కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రపంచం మొత్తం వీక్షించే ఈ ఉత్సవాల ద్వారా తెలుగు అభివృద్ధికి ప్రభుత్వం చేసే కృషి చాటిచెప్పే విధంగా సభలు, కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిల్లో వ్యాసరచన, వక్తృత్వ, గాత్రం, కవితారచన మొదలైన అంశాల్లో ఇంటర్,డిగ్రీ, పీజీ స్థాయిల్లో పోటీలు నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే కలెక్టర్ తెలుగు భాష ప్రాధాన్యత, విశిష్టతపై వ్యాసరచన, కవితా పోటీలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.