హైదరాబాద్

మరో 500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,డిసెంబర్ 7: మహానగరం పరిధిలో రోజురోజుకీ జనాభా పెరిగిపోతున్నందున, ఎప్పటికపుడు చెత్తను తరలించేందుకున్న సిబ్బంది, వాహానాలు, యంత్రాలను పెంచుకోవాల్సిన అవసరముందని గురువారం కౌన్సిల్ సమావేశంలో టీఆర్‌ఎస్, మజ్లీస్, బీజెపీ పార్టీలు అభిప్రాయపడ్డాయి. అంతేగాక, పారిశుద్ద్యానికి సంబంధించి సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ సమాధానం చెబుతూ చెత్త సేకరణ, తరలింపు, రీ సైక్లింగ్ విధానాల్లో యూరప్‌లోని అరుదైన విధానాన్ని మనం అనుసరిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 44 బిన్లు, 2వేల ఆటోటిప్పర్ల పంపిణీతో పాటు ప్రజల్లో తడి,పొడి చెత్తపై అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లను నియమించామన్నారు. ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించటం లేదని సభ్యులు తమ దృష్టికి తెచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ చెత్తను సేకరించేందుకు వచ్చే కార్మికులకు నెలకు రూ. 50 చెల్లించాలని, సక్రమంగా చెల్లిస్తే, వారు కూడా సక్రమంగా చెత్తను సేకరించేందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. నెలకు కేవలం రూ. 50 చెల్లించటం పెద్ద భారమేమీ కాదని, చెల్లించకపోవటానికి పేదరికం కారణం కాదని, కాకపోతే ఎందుకు చెల్లించాలన్న నగరవాసులు తమ మైండ్ సెట్‌ను మార్చుకోవల్సిన అవసరముందని వివరిస్తూ, తాను కూడా తన ఇంటికొచ్చే కార్మికుడికి గతంలో రూ. 50, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా వచ్చిన తర్వాత నెలకు రూ. వంద చెల్లిస్తున్నట్లు సభాముఖంగా వివరించారు. ఇప్పటికే రెండువేల ఆటోలను అందుబాటులోకి తెచ్చిన తమకు మొదటి దశగా నిరుద్యోగులకు పంపిణీ చేసిన వెయ్యి ఆటోల విషయంలో అనేక గొడవలు చెలరేగాయని వివరించారు. ఆటోలు అందుబాటులోకి రాకముందు ఆటో రిక్షాల్లో చెత్తను సేకరించే కార్మికులు వీటి కేటాయింపునకు సంబంధించి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో, డ్రైవింగ్ లైసెన్సు ఉన్న ఆటో కార్మికులకే వాటిని కేటాయించామని సభ్యులకు వివరించారు. ఇకా అదనంగా సమాకూర్చాలనుకున్న 500 స్వచ్ఛ ఆటో టిప్పర్ల విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో రెండువేల ఆటోలను టాటా కంపెనీ నుంచి ఒక్కోక్కటి ధర రూ. 3.80లక్షలకు కొనుగోలు చేయగా,ప్రస్తుతం ఆ ధర రూ. 4.5 లక్షలకు పెరిగింది. దీంతో ప్రభుత్వం రీ టెండర్ ప్రక్రియను చేపట్టినందున ఆలస్యమైందన్నారు. గత ధర కన్నా అదనంగా నాలుగైదు వేలను పెంచి ఆటోలను ఇచ్చేందుకు మహీంద్ర కంపెనీ సుముఖతను వ్యక్తం చేసిందని, కానీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇవ్వాల్సి ఉన్నందున, జీహెచ్‌ఎంసీకి ఇవ్వాల్సిన ఆటోలకు 45 రోజుల గడువు పెట్టిందని, జనవరి మాసంలో అదనపు స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తెస్తామని కమిషనర్ కౌన్సిల్‌కు వివరించారు.