హైదరాబాద్

అమెరికాలో నగర విద్యార్థిపై కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: అమెరి కాలో మహ్మద్ అక్బర్ అనే నగర విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం కాల్పులు జరిపారు. చికాగోలోని అల్‌బరి పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. పార్క్ చేసిన కారు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్బర్‌పై కాల్పులు జరి పారు. ఘటనలో అక్బర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాధి తుడు అక్బర్ చికాగోలోని డెవ్రీ వర్సిటీ విద్యార్థి.

శిల్పారామంకు

ముప్పు తప్పినట్లే!

హైదరాబాద్, డిసెంబర్ 9: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రద్దీ నుంచి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి) ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా క్షేత్ర స్థాయిలో పనులకు రకరకాల అడ్డంకులెదురవుతున్నాయి. కెబీఆర్ పార్కు చుట్టూ చేపట్టే పనులకు సంబంధించి చాలా కాలం వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడవటం, అలాగే కంచన్‌బాగ్‌లో ప్రతిపాదన రద్దు చేయాలన్న డిమాండ్లు వంటి అడ్డంకులేర్పడిన సంగతి తెలిసిందే! కానీ ఎస్‌ఆర్‌డిపి పనులను ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా శిల్పారామం వద్ద అలైన్‌మెంట్‌లో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఫ్లై ఉండటం, అలాగే పొడిగించిన మెట్రోరైలు కారిడార్ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్తుండటంతో ఇక్కడ ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద నిర్మించేందుకు ప్రతిపాదించిన రోటరీ, గ్రేడ్ సెపరేటర్లను నిర్మించాల్సి ఉంది. ఈ పనుల కోసం ఇప్పటికే 4.6 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని, 1.6ఎకరాల ప్రభుత్వ స్థలాలను సేకరించాల్సి ఉంది. హైటెక్ నగరంలోనూ కాస్త గ్రామీణ వాతవరణాన్ని తలపించే హస్తకళల గ్రామం శిల్పారామానికి చెందిన స్థలాన్ని సేకరించాలని ప్రతిపాదన తెరపైకి రాగా, అందుకు ప్రభుత్వం విముఖతను వ్యక్తం చేయటంతో ఇక్కడ అలైన్‌మెంట్ మార్చాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. శిల్పారామానికి ఏ మాత్రం ముప్పు కలగకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు మరో కోణంలో రోటరీ,గ్రేడ్ సెపరేటర్‌ను నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయన్న విషయంపై అధ్యయనం చేయాల్సిందిగా ఐఐటి హైదరాబాద్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
కంచన్‌బాగ్‌లో ప్రతిపాదన రద్దయినట్టేనా?
ఎస్‌ఆర్‌డిపి కింద కంచన్‌బాగ్ ఓవైసీ ఆసుపత్రి వద్ద కూడా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ఆయా ప్రాంతాల నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టుకు ఎలాంటి ఆటంకాల్లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద నిర్మించాలని భావించిన అండర్‌పాస్ ప్రతిపాదన కూడా దాదాపు రద్దయినట్టేనని తెలిసింది. ఈ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ ఓ ఎమ్మెల్యే సర్కారుకు లేఖ రాయటంతో ఈ ప్రతిపాదన రద్దయినట్లు తెలుస్తోంది. కానీ ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద ఇక్కడ నిర్మించాల్సిన అండర్‌పాస్, జంక్షన్ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే ఓ ఏజెన్సీకి టెండరు దక్కటంతో ఆ ఏజెన్సీ ఎలా స్పందిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.