హైదరాబాద్

తెలుగు మహాసభలకు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభలకు నగరం ముస్తాబవుతోంది. మహాసభలను గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగ్గట్టుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు నగరం మొత్తం ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. నగరంలోని ఎల్‌బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సెక్రెటరియేట్ ప్రాంతాలు ప్రత్యేక వెలుగులతో ఆకర్షణీయంగా దర్శనం ఇవ్వనున్నాయి. వీటితో పాటు గ్రేటర్ పరిధిలోని ముఖ్య జంక్షన్లు, ప్రధాన రహదారులపై నగరవాసులతో పాటు సభలకు విచ్చేసే అతిధులకు ఆశ్చర్యాన్ని కలిగించనున్నాయి. ఇప్పటికే ఎల్‌ఇడి వెలుగులతో నిండిపోయిన భాగ్యనగరం మరింత అందంగా కనిపించనుంది. మహాసభల విద్యుత్ అలంకరణకు జీహెచ్‌ఎంసి సుమారు రెండు కోట్లను ఖర్చు చేయనుంది.

సీసీఎంబీ వ్యవస్థాపకులు
ప్రసిద్ధ శాస్తవ్రేత్త లాల్జీసింగ్ కన్నుమూత

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రఖ్యాత శాస్తవ్రేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ లాల్జీసింగ్ ఆదివారం రాత్రి వారణాసిలో కన్నుమూశారు. డిఎన్‌ఎ ప్రింటింగ్‌కు పితగా ఆయనను భావిస్తారు. సిసీఎంబీ డైరెక్టర్‌గా, బెనారస్ హిందూ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా కూడా పనిచేసిన లాల్జీసింగ్ ఆదివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతోవెంటనే ఆయనను అక్కడే ఉన్న సందర్‌లాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీలో జరిగిన నైనా సాహ్ని హత్య కేసుకు శాస్ర్తియ పరిష్కారం ద్వారా లాల్జీసింగ్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అందరితో కలిసి నవ్వుతూ పనిచేసే లాల్జీసింగ్ జీవశాస్తవ్రిజ్ఞాన రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఎనలేని కృషి చేశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సీసీఎంబీ, ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి లాల్జీసింగ్ మృతి వార్తను సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్‌మిశ్రా ట్వీట్ చేయడంతో తెలిసింది.