హైదరాబాద్

భరతమాతను అవమానించిన వ్యక్తిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఓ సమావేశంలో ప్రసంగిస్తూ భారత్‌మాతను అవమాన పరచిన వ్యక్తిపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన ఎలమంచిలి విజయ్‌కుమార్ క్రీస్ట్ గాస్పెల్ టీం బృందం డైరెక్టర్‌గా పనిచేస్తూ హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో నివాసముంటున్నాడు. గత ఆగస్టు 7వ తేదీన క్రిస్టియన్లను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో ‘్భరత మాతకు ఎంత మంది భర్తలు..మూడు కోట్లా..అంటూ అవమాన పరిచారు. ఈ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ హుస్సేనీ ఆలంకు చెందిన టి కునల్ రావు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుస్సేనీ ఆలం పోలీసులు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై ఐపీసీ 153-ఏ, 153-బి, 295-ఏ ల కింద కేసులు పెట్టినట్టు దక్షిణ మండల డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు.
ప్రైజ్‌మనీ పేరుతో మోసం
నలుగురి అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 11: మీకు లాటరీ తగిలింది. కోటి రూపాయలు గెలుపొందారు. మేము ఆర్‌బీఐ అధికారులం మాట్లాడుతున్నాం..మీ ప్రైజ్ మనీ పొందాలంటే కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ అమాయకులను మోసగిస్తున్న నలుగురు ముఠా సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ప్రైజ్‌మనీ పేరుతో అమాయకులను మోసగిస్తున్న డేవిడ్ డబ్రీ, సుమిత్ గుప్తా, అమిత్ గుప్తా, నితిన్ కుమార్‌లు ఒక ముఠాగా ఏర్పడి గత అక్టోబర్ 5న బంజారాహిల్స్ చెందిన మహమ్మద్ ఫిరోజ్ ఖాన్‌కు ఫోన్ చేసి తాము రిజర్వ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం..మీకు రూ. 3.60కోట్లు లాటరీ తగిలిందని, మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపాలంటే అందుకు కొంత టాక్స్ చెల్లించాలని నమ్మించారు. దీంతో ఫిరోజ్ ఖాన్ ఢిల్లీలోని వివిధ బ్యాంకుల్లో రూ. 22 లక్షలు డిపాజిట్ చేశాడు. డబ్బులు డ్రా చేసుకున్న ముఠా సభ్యులు ఫోన్ స్విచ్ఛ్ఫా చేయడంతో తాను మోసపోయానంటూ ఫిరోజ్ ఖాన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మోసానికి పాల్పడిన నిందితులను ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి డేవిడ్ నైజీరియన్ కాగా, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని ఏసీపీ రఘువీర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ వివరించారు.