హైదరాబాద్

మళ్లీ వస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: మహానగరం వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా యాచకులు రోడ్లపై కన్పించకుండా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతోంది. వీరికి ప్రత్యామ్నాయంగా పునారాసం కల్పించేందుకు చర్యలను జీహెచ్‌ఎంసీ మరింత ముమ్మరం చేసింది. ఇందుకు నాలుగు విడతలుగా రచించిన కార్యచరణలో ఇప్పటి వరకు 351 మంది యాచకులను నగరంలోని వివిధ కూడళ్లు, జంక్షన్లు, రోడ్లపై గుర్తించి, వారికి పునరావాసం కల్పించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇప్పటి వరకు గుర్తించిన యాచకుల్లో బాల యాచకులు తిరిగి రోడ్లపై వచ్చి యాచక వృత్తిని కొనసాగించకుండా ఉండేందుకు గాను వారి నుంచి వారి తల్లిదండ్రుల వివరాలను తెల్సుకుని, వారికి అప్పగిస్తున్నారు. అంతేగాక, వారి జీనవ శైలిలో మార్పు వచ్చేలా వారికి ప్రత్యేక కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్లు జీహెఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు పిల్లలను మళ్లీ యాచక వృత్తిలోకి దింపకుండా తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకలమైన పత్రాన్ని రాయించుకుని మరీ వారికి అప్పగిస్తున్నారు. వారికి విద్యావకాశాలను కల్పించే అంశంపై కూడా పత్రంలో స్పష్టమైన హామీని తీసుకుంటున్నారు. గత జూలై మాసలంలో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక చొరవతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, పోలీసులు సమష్టిగా చేపట్టిన డ్రైవ్‌లో 22 మంది బెగ్గర్లను గుర్తించి వారిని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 222 మంది యాచకులను గుర్తించగా, వారిలో 24 మంది మహిళలు, 138 మంది పురుషులున్నారు. వారిని చంచల్‌గూడ, చెర్లపల్లిల్లోని అనాధశ్రమయాలకు తరలించారు. అలాగే డిసెంబర్ 7వ తేదీ నుంచి సోమవారం వరకు నిర్వహించిన డ్రైవ్‌లో 48 మంది యాచుకలను గుర్తించగా, వీరిలో 33 మంది పురుషులు, 12 మంది మహిళలతో పాటు ముగ్గురు బాల యాచకులున్నట్లు గుర్తించారు. పురుష యాచకులను చంచల్‌గూడకు, మహిళా, బాల యాచకులను చెర్లపల్లిలోని అనాధశ్రమానికి తరలించారు. ఈ ఆశ్రమాల్లో వీరికి జైళ్ల శాఖ ద్వారా భోజన సదుపాయం, ఆశ్రయం కల్పిస్తూ, వారికి మళ్లీ బెగ్గర్లుగా రోడ్లపైకి రాకుండా కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రకంగా పునరావాస కేంద్రాలకు తీసుకువస్తున్న యాచకుల బయోమెట్రిక్ వివరాలను సేకరించటంతో పాటు వారు తిరిగి రోడ్లపైకి మళ్లీ బెగ్గర్లుగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపుతున్నారు. అంతేగాక, వీరిలో శారీకంగా ధృడంగా ఉన్న వారికి, కష్టపడగలిగే శక్తి ఉన్న వారికి స్వయం ఉపాధి రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, వికలాంగులకు తగు ఉపాధి కార్యక్రమాలను కల్పించనున్నారు. నా అనే వారు లేని బాల యాచకులను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించి, వారికి తగు విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. ఇక వయస్సు పై బడి, పని చేయలేని వృద్ద యాచకులను పునరావస కేంద్రాల్లో ఉంచేందుకు వీలుగా జీహెచ్‌ఎంసి పక్కా ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి
*జేసీ సుందర్ అబ్నార్ ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చూడాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తప్పని సరిగా 30 రోజులలోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 30 రోజుల కంటే ఎక్కువ రోజుల వరకు పెండింగ్‌లో ఉన్న పిటీషన్లను శాఖల వారీగా సమీక్షించారు. శాఖల మధ్య సమన్వయానికి ప్రజాదర్బార్ ఒక మంచి వేదిక కాబట్టి శాఖాపరంగా ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బార్‌లో చర్చించుకుని పరిష్కరించుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. చిన్న చిన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియపరిచి ప్రజావాణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అన్నారు. తమ శాఖలలోని దివ్యాంగుల ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటి వరకు సమర్పించని వారు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పేమెంట్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపు, పెన్షన్‌లు, భూ సమస్యలు, రుణ మంజూరు, రుణ మాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాలపై సుమారు 77 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.