హైదరాబాద్

తెలుగు మహాసభలకు ప్రత్యేక స్వాగత కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడి, భాషా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఈ నెల 14 నుంచి నగరంలో ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఓ ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సభలకు విచ్చేస్తున్న అతిథులను సముచిత రీతిలో ఆహ్వానించాలన్న ప్రధాన లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ కమిటీకి నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి వ్యవహరించనున్నట్లు జిల్లా కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు. అయితే సభల మొదటి రోజైన 14వ తేదీన ప్రారంభోత్సవం, అలాగే 19న ముగింపు ఉత్సవాలు ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు, ఆ తర్వాత ఐదు రోజుల వివిధ కార్యక్రమాలను ఇతర ఐదు వేదికల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన వేదిక అయిన ఎల్‌బీ స్టేడియంతో పాటు ఇతర ఐదు వేదికలకు వచ్చే అతిథులు, ఆహ్వానితుల రాకపోకలను జేసీ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్దేశిత జిల్లాలోని తెలుగు పండితులు, తెలుగు భాష సాహిత్యం తదితర రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగస్వాములయ్యేందుకు వీలుగా ఆయా వ్యక్తులను గురించి, జాబితాను తయారు చేయాల్సిందిగా కలెక్టర్ విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ వ్యవహారాలన్నింటినీ సమన్వయం చేసేందుకు ఓ డిప్యూటీ డీఈఓను నామినేట్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పూర్తయిన జిల్లా స్థాయి పోటీలు
తెలుగు మహాసభలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో తెలుగు భాష విశిష్టత, ఔన్నత్యంపై ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించటం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి వివరించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపదారు.
రూ. 45.60లక్షలతో పూల అలంకరణ
తెలుగు మహాసభలకు ఏర్పాట్లు నభూతో నభవిష్యత్ చందంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం, అలాగే మరో ఐదు సాంస్కృతిక వేదికలకు చేరుకునే రోడ్లలోని కూడళ్లు, జంక్షన్లలో రూ. 2 కోట్ల వ్యయంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయటంతో పాటు రోడ్డుకిరువైపులా కన్పించే గోడలపై చూడచక్కని చిత్రలేఖనాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు రూ. 45.60 లక్షల వ్యయంతో జీహెచ్‌ఎంసీ వివిధ జంక్షన్లు, కూడళ్లలో అందమైన పూల మొక్కలు, పూలతో అలంకరించనుంది.