హైదరాబాద్

బంగారు భాగ్యనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: మహానగర ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతోందని రాష్ట్ర మున్సిపల్ ఐటీ,శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. పాలకులు, ప్రజలు, అధికారుల సమష్టి కృషితోనే విశ్వనగరం కల సాకారామవుతోందని ఆయన వివరించారు.
మంగళవారం ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించే వాహానాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన స్వచ్ఛత పురస్కారాల ప్రదానోత్సవ సభలో మాట్లాడుతూ జనాభాకు తగిన విధంగా వౌలిక వసతులను, ఉపాధి, ఉద్యోగాలు, రవాణా సౌకర్యాల కల్పనలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కన్నా మన నగరం ఎంతో ముందంజలో ఉందని వివరించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభానికి ముందే హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాజాగా ‘మనం మారుదాం..నగరాన్ని స్వచ్ఛంగా మారుద్దాం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేకంగా వాహనాలు అందుబాటులోకి రావటంతో మరో నూతన అధ్యాయనం మొదలైందన్నారు. దీంతో పాటు మున్సిపల్ వ్యర్థాలతో 20 మెగా వాట్ల విద్యుత్ తయారీ ప్లాంట్లను అతి త్వరలో ప్రారంభించుకోనున్నామని ఆయన తెలిపారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును గ్రీన్ క్యాపింగ్ చేయటంతో పాటు ల్యాండ్‌ఫీల్, దుర్వాసన తొలగింపునకు రూ. 140 కోట్ల వ్యయంతో పనులను చేపట్టాలని వివరించారు. జవహార్‌నగర్ డంపింగ్ యార్డుతో పాటు మరో రెండు డంపింగ్ యార్డులను గుర్తిస్తున్నామని కేటీఆర్ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా మురికివాడల స్థానంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి ‘మన నగరం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలనీ సంక్షేమ సంఘాలు, స్థానిక ప్రముఖుల నుంచి 300 మందిని ఎంపిక చేసి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వీరితో నగరాభివృద్ధి కార్యక్రమాల అమలు, తగు సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛత అనేది నిరంతర ప్రక్రియ అని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే చెత్తను తడి,పొడిగా వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలని ఆయన సూచించారు.

న్యాయం కోసం
24వ రోజుకు చేరిన సంగీత పోరాటం

ఉప్పల్, డిసెంబర్ 12: ఆడపిల్ల పుట్టిందని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త నుంచి రక్షణతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు సంగీత చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 24వ రోజుకు చేరింది. అత్తింటి ముందే న్యాయ పోరాటానికి దిగిన సంగీతకు మహిళా సంఘాలు అండగా నిలువగా బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌రావు సంఘీభావం ప్రకటించారు. సంగీతకు మద్దతుగా ఆందోళనకు దిగిన మహిళా సంఘాలు, ఇతర పెద్దలకు.. అత్తింటి తరుపున కోర్టు నుంచి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.