హైదరాబాద్

ప్రజా సహకారంతోనే ‘మెట్రో’ పట్టాలెక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రోరైలును స్థానిక ప్రజల సహకారంతోనే పట్టాలెక్కించగలిగామని మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నో ఇండియా ప్రొగ్రాం(కేఐపీ)పై సౌతాఫ్రిక, గయానా, ఫిజీ, మలేషియా, మారీషియస్, ఇజ్రాయిల్ తదితర మొత్తం 9 దేశాలకు చెందిన 40 మంది భారతీయ యువకులు గురువారం మెట్రోరైలు ఎండీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోరైలుపై వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రతిపాదనల రూపకల్పన స్థాయి మొదలుకుని టెండర్లు, క్షేత్ర స్థాయిలో పనులకు సంబంధించి అనేక అడ్డంకులను ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహారించి ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు వివరించారు. భారతదేశంలోని పట్టణాల్లో ఎక్కువ వౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మెట్రోరైలు అని వివరించారు. ప్రయాణికులు, వికలాంగులు, మహిళలు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వసతులను కల్పించినట్లు వివరించారు.
దీనికి తోడు కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా మెట్రోరైలు ప్రాజెక్టును అందుబాటులోకి తేవటంతో పాటు మెట్రోరైలుకు కనెక్టివిటీగా నడిపే ఫీడర్ వాహానాలను కూడా ఏకో ఫ్రెండ్లీ వాహానాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతేగాక, మెట్రోరైలు నిర్మాణంలో కొన్ని సందర్భాలు అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యతకే సవాలుగా నిలిచాయని, వాటిని ఎంతో వ్యూహాత్మకంగా అధిగమించామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం రసూల్‌పురా నుంచి అమీర్‌పేట వరకు మెట్రోరైలులో ప్రయాణించి, ప్రయాణం, రైల్‌లో సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు.