హైదరాబాద్

వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఈ ఏటా మరింత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కార్వాన్‌లోని శ్రీ రంగనాథస్వామీ దేవాలయం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా తిరుమలలో మాదిరిగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టంది. ఇందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురువారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాథస్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా పూలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయాలన్నారు. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి వస్తారని, భక్తుల సంఖ్యకు తగిన ఇవధంగా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు అసౌకర్యం కలిగేలా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని సూచించారు. మూడు సంవత్సరాల నుంచి మన సంస్కృతీని కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని పండుగలకు ఘనంగా ఏర్పాట్లు చేసి, వైభవంగా నిర్వహించకునేందుకు ఎంతో సహకరిస్తుందన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్టీసి, దేవాదాయ, పోలీసు తదితర శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేవించారు. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించారని, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులురానున్నట్లు అంచనా వేశామన్నారు. ముఖ్యంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నందున ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండకూడదని ఆయన సూచించారు. మూడు రోజుల పాటు మంచినీటి సౌకర్యం కోసం సుమారు 2లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులకు సూచించారు. అంతేగాక, విద్యుత్ శాఖ కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. మెడికల్ క్యాంప్‌లలో డాక్టర్, సిబ్బంది ఉండేలా, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ ఎంట్రెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఏకాదశి రోజున వచ్చే భక్తులందరికీ స్వామి దర్శనం దక్కేలా, క్రమపద్దతిలో దర్శనమయ్యేలా భక్తులు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు సేవలందించాలన్నారు. ధనుర్మాస ఉత్సవాలపై దేవాలయ కమిటీ రూపొందించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. దేవాలయ కమిటీ సభ్యులు పాస్‌ల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, బాలాజీ, స్థానిక కార్పొరేటర్ కృష్ణ, తహశిల్దార్, జీహెచ్‌ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.