హైదరాబాద్

రండి..రండి..రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగరం వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వారిని రిసీవ్ చేసుకుని, వారు బస చేసే ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహానాలను అందుబాటులో ఉంచింది. అతిధి మర్యాదల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన స్వాగత కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ చిరంజీవులు, కలెక్టర్ యోగితారాణా పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తయినట్లు వారు వెల్లడించారు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చే ప్రతినిధుల కోసం విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జూబ్లీబస్ డిపో, ఇమ్లిబన్ బస్ డిపో, సికిందరాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాచిగూడ, సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక్కోక్కటి చొప్పున మొత్తం ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చే అతిధులకు సాదరంగా స్వాగతం పలికి కాఫీ, టీ, అల్పాహారం అందజేసి వారికి కేటాయించిన హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు, తిదతర ప్రాంతాలకు చేరవేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో అతిధులను రిసీవ్ చేసకునేందుకు ముగ్గురు తహశిల్దార్లు, ఆరుగులు వీఆర్‌ఓలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న విశిష్ట అతిధులకు స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లా ఏంపీడీఓ పంచాయతీ సెక్రటరీలను నియమించామని తెలిపారు. ప్రతినిధులకు వసతి, రవాణా వంటి సౌకర్యాల కల్పన కోసం హెచ్‌ఎండీఏ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి 427 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1250 మంది తెలుగు సభలకు వస్తున్నారని అధికారులు తెలిపారు. వీరు గాక, అవార్డు గ్రహీతలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, విశిష్ట అతిధులుగా వస్తున్నారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నాం వరకు ప్రతినిధుల సంఖ్య అధికంగా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.