హైదరాబాద్

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని కేంద్ర తాగునీరు, పారిశుద్థ్య శాఖ మంత్రి రమేష్ జిగజినాగి ప్రశంసించారు. ప్రధాని నరేంద్రమోదీ తరచూ భగీరథ పథకం గురించి ప్రస్తావిస్తూ ఉంటారని అన్నారు. శనివారం నాడిక్కడ ఒక హోటల్‌లో తాగునీరు, పారిశుద్ధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి కేంద్రమంత్రికి మిషన్‌భగీరథ గురించి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు మిషన్ భగీరథ పథకం గొప్పతనం గురించి చెబుతూ ఉంటారని తెలిపారు. ఏక కాలంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును తాను పార్లమెంటు సమావేశాల అనంతరం సందర్శిస్తానని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు పది వేల మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందని అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం తనకు చాలా సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్‌ఆర్‌డిడబ్ల్యూపి కన్సల్టెంట్ నర్సింగరావు, రంగారెడ్డి జిల్లా ఎస్.ఈ ఆంజనేయులు, ఈఈలు విజయ్‌కుమార్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.