హైదరాబాద్

తెలంగాణ,ఏపి జట్ల గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జనవరి 2: తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 65వ జాతీయ సీనియర్ మహిళలు, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి. చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల విభాగంలో నిర్వహించిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 44-43 స్కోరు తేడాతో ప్రత్యర్థి చత్తీస్‌గడ్‌పై, మహిళల విభాగంలో నిర్వహించిన మ్యాచ్‌లో తెలంగాణ 44-40 తేడాతో అస్సాంపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో నిర్వహించిన మ్యాచ్‌లో కర్నాటక 75-9 స్కోరు తేడాతో విదర్భపై, కేరళ 49-35తో ఒడిషాపై, గుజరాత్ 48-26తో జమ్ము కాశ్మీర్‌పై, ఏపీ 50-18తో బెంగాల్‌పై, ఢిల్లీ 55-32తో జార్కండ్‌పై, యుపి 48-17తో బిఎస్‌ఎన్‌ఎల్‌పై, రాజస్తాన్ 42-38 స్కోరు తేడాతో ఢిల్లీపై, తెలంగాణ 46-19తో చత్తీస్‌గడ్‌పై, హర్యాణ 42-22తో కేరళపై విజయం సాధించింది. ఎంపి-పంజాబ్, తెలంగాణ-బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మహిళల విభాగంలో నిర్వహించిన మ్యాచ్‌లో కర్నాటక 42-18తో విదర్భపై, తమిళనాడు 45-28తో మణిపూర్‌పై, చత్తీస్‌గడ్ 61-12తో పాండిచ్చేరిపై, బీహర్ 53-17తో జమ్ముకాశ్మీర్‌పై, వెస్ట్‌బెంగాల్ 42-27తో తెలంగాణపై, కేరళ 31-19తో మధ్యప్రదేశ్‌పై, కర్నాటక 42-18తో విదర్భపై, మహారాష్ట్ర 77-19తో గుజరాత్‌పై, యుపీ 57-17తో అస్సాంపై, పంజాబ్ 64-34తో జార్కండ్‌పై, హిమచల్‌ప్రదేశ్ 38-32తో రాజస్తాన్‌పై, బీహర్ 31-15తో ఏపిపై విజయం సాధించింది.