హైదరాబాద్

జీఓ 31ని వెంటనే రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 2: చెక్క పనులు చేసుకొని జీవనం కొనసాగించే వారిపై తీవ్ర ప్రభావం చూపించే విధంగా తీసుకువచ్చిన జీఓ 31ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పరిషత్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పున్నమాచార్యులు, రాజేషం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు కులవృత్తులను రక్షిస్తామని చెబుతూనే విశ్వకర్మల్లో భాగమైన వడ్రంగ వృత్తిని కూకటి వెళ్లతో సహా కూల్చివేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అటవీ శాఖ అధికారుల అనాలోచిత నిర్ణయంతో వెలువడ్డ ఈ జీఓ ప్రకారం.. అటవీయేతర ప్రాంతాల్లోని తుమ్మ, వేప చెట్లను సైతం వడ్రంగి పనిచేసుకునే వారు సేకరించ వీలు ఉండదని అన్నారు. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఈ వృత్తి మరింత కష్టాల్లోకి నెట్టివేయబడుతుందని, ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబాలు రోడ్డన పడే ప్రమాదం నెలకొంటుందని అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఈ జీఓను రద్దు చేయడంతోపాటు జీ ఓ 55లో సైతం సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించక పోతే ఫిబ్రవరి 6న భారీ బహిరంగసభను నిర్వహించి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షులు భాస్కర్‌చారి, బాలకృష్ణచారి, రమేష్‌బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

‘సహస్రచంద్ర దర్శన’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, జనవరి 2: ప్రముఖ నటక రచయిత సీఎస్ రావు రచించిన ‘సహస్రచంద్ర దర్శన’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి పాల్గొని ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. సీఎస్ రావు నాటక రచయితగా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నారని కీర్తించారు. సీఎస్ రచించిన పుస్తకాలలో ప్రత్యేకత ఉంటుందన్నారు. ప్రముఖ సాహితీ వేత్త డా.పాలకుర్తి మధు సూదన రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పద్మభూషణ్ డా.కేఐ వరప్రసాద రెడ్డి, ప్రముఖ రచయిత డా.వీ.కొండల రావు, రంగస్థల నటుడు డా.దుగ్గిరాల సోమేశ్వర రావు, శంకర టీవీ ఛానల్ సీఈఓ డా.వోలేటి పార్వతీశం, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్.ప్రభాకర రావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.

అంకితభావంతో పనిచేయాలి

హైదరాబాద్, జనవరి 2: నూతన సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాను వివిధ అభివృద్ధి సంక్షేమ, పథకాల అమలులో అగ్రగామిగా నిలిపేందుకు సిబ్బంది, అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ యోగితారాణా హితవు పలికారు. ఆంగ్లనూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టర్‌ను కలిసిన వివిధ శాకలకు చెందిన అధికారులు, తహశీల్దార్లు, సిబ్బందినుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పలు రకాల పథకాలను అమలు చేస్తోందని, ఆయా పథకాలు అర్హులకు అందేలా అధికారులు నిబద్దతతో పనిచేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతాన్ని చిన్నారులందరికీ అందించాలని అన్నారు. జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించేందుకు ఎల్లవేళలా అపమ్రత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ క్యాలెండర్, గెజిటేడ్ ఆఫీసర్ల సంఘం క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ నిఖిల, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనం, ఆర్డీఓ చంద్రకళ, జిల్లా టీజీఓ అధ్యక్షుడు కృష్ణయాదవ్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, యూనస్, నాలుగో తరగతి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సదానంద్, జిల్లా అధికారులు డీఎంహెచ్‌ఓ డా.పద్మజ, సాంఘిక అభివృద్ధి శాఖ డీడీ హన్మంత్‌నాయక్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ జిల్లా సంక్షేమాధికారి సునంద, వికలాంగుల శాఖ ఏడీ సుదర్శన్, సీపీఓ రామబ్రహ్మం, సమాచార శాఖ ఏడీ రమాదేవీ, డీఈఐఈ అనంతం, వయోజన విద్యాశాఖ డీడీ నాగలక్ష్మి పాల్గొన్నారు.