హైదరాబాద్

స్వచ్ఛ సర్వేక్షణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: మహానగర పాలక సంస్థ అధికారులు చేసిన కృషి ఫలించింది. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోని మెట్రో నగరాల్లో అగ్రస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదే స్పూర్తితో ఈ ఏటా జీహెచ్‌ఎంసీ కాస్త ముందుగానే స్థానికులు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధునులను సైతం భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం చేసినందుకు ఫలితం దక్కింది. మహానగరాన్ని బహిరంగ మల,మూత్ర విసర్జనల్లేని నగరంగా ఇప్పటికే బల్దియా స్వయంగా ప్రకటించుకున్నా, ఇపుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్ సైతం నగరాన్ని ఓడీఎఫ్ సిటీగా అధికారికంగా ప్రకటించింది. బల్దియా స్వయంగా ప్రకటించుకున్న తర్వాత ఇటీవలే కేంద్ర నుంచి నగరానికి వచ్చిన స్వచ్ఛ్భారత్ మిషన్ నాణ్యత పరిశీలన బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించి, బహిరంగ మల,మూత్ర విసర్జనలు జరగటం లేదని నిర్థారించిన తర్వాతే ఈ ప్రకటన చేసింది. ఈ గుర్తింపు కోసం జీహెచ్‌ఎంసీ నగరంలో అదనంగా టాయిలెట్లను అందుబాటులోకి తేవటంతో పాటు ఇక్కడ నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తూ వారికి బల్దియానే బూట్లు, డ్రెస్‌ను అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రత్యేకంగా మహిళల కోసం షీ టాయిలెట్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు టాయిలెట్ల దత్తత అనే వినూత్న కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టింది. ఈ టాయిలెట్ల పరిశుభ్రతపై పూర్తిగా పర్యవేక్షణ ఉండేందుకు గాను సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది, ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
కేటీఆర్ స్పూర్తితోనే..
*మేయర్ బొంతు రామ్మోహన్
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిరంతరం ఇచ్చిన స్పూర్తితోనే హైదరాబాద్ నగరాన్ని ఓడీఎఫ్ నగరంగా తీర్చిదిద్దుకున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని కోరారు. స్వచ్ఛ హైదరాబాద్ రూపకల్పనలో మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగా ఉండి ప్రజలకు వెసులుబాటు కల్గించే విధంగా ఉన్నాయన్నారు. పరిశుభ్రత ప్రామఖ్యతలో నగర ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములై, నగర విశిష్టతను పెంపొందించేందుకు సహకరించాలన్నారు.
బాధ్యత మరింత పెరిగింది: కమిషనర్ జనార్దన్ రెడ్డి
నగరాన్ని స్వచ్ఛ్భారత్ మిషన్ ఓడీఎఫ్ సిటీగా ప్రకటించటం పట్ల తమపై మరింత బాధ్యతను పెంచిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నగరంలో బహిరంగ మల,మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరముందన్నారు. తిరిగి మరో ఆరు నెలలకు ఓడీఎఫ్ సర్వే ఉంటుందని ఆయన వివరించారు. ఈ స్పూర్తితో 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపడానికి మరింత కృషి చేస్తున్నట్లు ప్రకటించారు.