హైదరాబాద్

ఇక రోడ్లు తళతళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన సాంకేతిక పరిజ్ఞానం
పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ వే శంషాబాద్ వరకు పొడిగింపు
త్వరలో మరో రూ. 3వేల కోట్ల పనులు ప్రారంభం
మార్చికి మైండ్ స్పేస్ అండర్‌పాస్, ఫ్లైఓవర్ పనులు పూర్తి
అండర్‌పాస్ ప్రారంభోత్సంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 3: సిటీలో రోడ్లు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ. 23వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీ ప్రణాళికను సిద్దం చేశామని, ఇందులో భాగంగా ప్రస్తుతం నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ, మైండ్ స్పేస్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, స్కైవేలు, మల్టీలేవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు.
ఎస్‌ఆర్‌డీపీ తొలి దశలో 19 ప్రాంతాల్లో దాదాపు రూ. 3200 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప సొసైటీ వద్ద 450 మీటర్ల పొడువున నిర్మించిన అండర్‌పాస్‌ను హోం మంత్రులు నాయిని నర్సింహరెడ్డి,మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి ప్రణాళికబద్దంగా, జవాబుదారితనంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని పలు రద్దీ ప్రాంతాలు, బిజీ జంక్షన్లలో ఇంకా రోడ్లను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు రూ. వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మరో రూ. 270 కోట్లతో అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ. 426 కోట్ల వ్యయంతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి తోడు ప్రస్తుతం ఏయిర్‌పోర్టుకు వెళ్లేందుకు వినియోగిస్తున్న పీవీఎన్ ఎక్స్‌ప్రెస్‌వేను శంషాబాద్ వరకు పొడిగిస్తామన్నారు. రెండో దశగా మరో రూ. 3వేల పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అండర్‌పాస్ నిర్మాణానికి పనె్నండునెలల గడువు ఉన్నా, కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వచ్చే మార్చి కల్లా మైండ్ స్పేస్ అండర్‌పాస్, ప్లై ఓవర్, కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ విగ్రహాం నుంచి ఫ్లై ఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్ పనులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌డీపీ పనులను తాను మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్ రెడ్డితో తరుచూ సమీక్షిస్తున్నందున పనులు వేగవంతమయ్యాయని వివరించారు. ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కూడా జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్, అండర్‌పాస్, మల్టీలేవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ 400 ఏళ్లకు పైగా ఉన్న పురాతన నగరమైన హైదరాబాద్‌ని విశ్వనగరంగా చేసేందుకు ప్రజల భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా మొట్టమొదటి సారిగా అండర్‌పాస్ నిర్మాణం రికార్డు స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగం రాలేదని నిరాశ

సనత్‌నగర్, జనవరి 3: ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన వెంకసాయి కృష్ణ (23) ఎంబీఎ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో భాగంగా నగరానికి వచ్చి ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని పద్మావతి హాస్టల్‌లో ఉంటున్నాడు. వివిధ సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన సోదరుడు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటింటికీ బొట్టు

నేటి నుంచే అమలు చేయాలని ఆదేశం జీహెచ్‌ఎంసీ 60 రోజుల ‘స్వచ్ఛ’కార్యచరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 3: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా స్వచ్ఛ్భారత్ మిషన్ మహానగరాలు, పట్టణాలపై నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో మెరుగైన ర్యాంకు కోసం జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రజల్లో అవగాహన తెస్తే తప్పా, ఫలితం దక్కలా లేదన్న విషయాన్ని గుర్తించిన బల్దియా 60రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఈ సారి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలోనే ప్రథమ ర్యాంకును సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం చేయటంతో పాటు ప్రజలను అందులో భాగస్వాములను చేస్తూ, వారిలో అవగాహన పెంపొందించేందుకు 60రోజుల ప్రణాళికను సిద్దం చేసింది. దీన్ని బుధవార నుంచే అమలు చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చెత్త, తడి,పొడి చెత్త, స్వచ్ఛ కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రోజుకో కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. నేటి నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ 60రోజుల పాటు స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తూనే, వాటికి సమాంతరంగా చెత్తను కాల్చటంపై విధించిన నిషేధం, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మరోసటి రోజు చెత్తను తడి,పొడిగా వేరు చేయటంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ల డ్రైవర్లు, కమ్యూనిటీ రీసోర్సుపర్సన్స్, స్వచ్ఛదూత్, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లకు అవగాహన కల్పించనుంది. ఆ తర్వాతి రోజు జీహెచ్‌ఎంసీ టాయిలెట్లను ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నాలుగో రోజు ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమాన్ని, అలాగే ఆ తర్వాతి రోజు టాయిలెట్ల వద్ద పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు గాను రంగురంగుల ముగ్గులను వేయాలని కార్యచరణను సిద్దం చేశారు. ఇదే రకంగా బస్ స్టాపులను శుభ్రపర్చటం, హోటళ్లు, పెట్రోల్ బంకులు వంటి వాటిల్లో సైనేజీలను ఏర్పాటు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో పోగయ్యే చెత్తతో ఎరువులు తయారు చేసేందుకు కంపోస్టు పిట్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్త వచ్చేలా ప్రజలను చైతన్యవంతులను చేయటంతో పాటు పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించాలన్నదే ఈ కార్యచరణ ప్రధాన లక్ష్యం. చివరి మూడురోజుల్లో పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రదానం, చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల సుందరీకరణ, చివరి రోజు పిన్‌పాయింట్ కార్యకమాలను నిర్వహించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పూర్తయ్యేలోపే ఈ కార్యక్రమాలను విస్త్రృతంగా నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం:సిపిఐ

గచ్చిబౌలి, జనవరి 3: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు విమర్శించారు.
సీపీఐ నగర శాఖ 9వ మహాసభ ఎస్.నారాయణ అధ్యక్షతన ఇజ్జత్‌నగర్‌లో జరిగింది. ఈకార్యక్రమానికి సర్సింగ్‌రావు ముఖ్యతిధిగా విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అవేధన వ్యక్తం చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం కట్టిస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం అవలబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలపై పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈకార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్యదర్శి కె.శ్రీశైలంగౌడ్, రాజేంద్రనగర్ కార్యదర్శి ఎండి.రియాజ్, సహాయ కార్యదర్శి టి.రామకృష్ణ నాయకులు కె.నర్సింహ్మరెడ్డి, కొత్తగూడ కార్యదర్శి వినయ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా వినయ్‌గౌడ్ ఇజ్జత్‌నగర్ నూతన కార్యవర్గన్ని ప్రకటించారు. కార్యదర్శిగా కె.ఖాసిం, సహాకార్యదర్శి ఎస్.శివకుమార్, కార్యవర్గ సభ్యులుగా నారాయణ, కళ్ళు, వెంకటస్వామి, కొప్పునూరి వెంకటస్వామి, ఎస్.నర్సమ్మ, దేవేందర్, కోశాధికారిగా వెంకటరాజులను నియమించినట్లు ప్రకటించారు.

మంద కృష్ణ మాదిగను
బేషరుతుగా విడుదల చేయాలి
మహేశ్వరం, జనవరి 3: ఎస్సీ వర్గీకరణ కోసం గాందేయ మార్గంలో పోరాటం చేస్తున్న మంద కృష్ణమాదిగను అరెస్టు చేసిన ప్రభుత్వం బేషరుతుగా విడుదల చేయాలని ఎమ్మార్పీ ఎస్ నాయకులు బక్కని రవి మాదిగ,ప్రశాంత్ మాదిగ,డిమాండ్ చేశారు.బుధవారం మహేశ్వరం తహశ్లీదార్ కార్యాలయం ఎదుట ఉపవ్యాస దీక్ష చేస్తారు.
అనంతరం వారు మాట్లాడుతూ సీ. ఎం. కీ.సి.అర్ ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని డీల్లీ కి తీసుకెళ్లాలని ,మంద కృష్ణ మాదిగ ఉపవాస దీక్ష చేస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం అని అరెస్టు చేయడం ఎంత వరకు సమాంజసమని ప్రశ్నించారు.వెంటనే మంద కృష్ణ మాదిగ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ నర్సింహ్మ, ఎ,నవీన్,గణేష్,మహేందర్, జగన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యను అధిగమించాలి
జీడిమెట్ల, జనవరి 3: పక్కా ప్రణాళికతో ట్రాఫిక్ సమస్యను అదిగమించాలని ఎమ్మెల్యే కేపీ వివేక్ సూచించారు. కుత్బుల్లాపూర్‌లో వివేక్ ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. వివేక్ మాట్లాడుతూ సుచిత్ర జంక్షన్ వద్ద విస్తరణ కోసం జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కుత్బుల్లాపూర్‌లోని చర్మాస్ పరిశ్రమ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులతో ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా రోడ్డును వేయాలని చెప్పారు. ఐడీపీఎల్ టౌరస్తాలో పెరిగిన రద్దీతో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చౌరస్తాను అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
సమావేశంలో బాలానగర్ ట్రాఫిక్ ఎసీపీ వినోద్, జడ్‌పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐలు అశోక్, రాములు, సత్యనారాయణ, ఎస్సై శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఈఈ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ అరవింద్, ఎఈ సత్యనారాయణ, డీఈ లాల్‌సింగ్ పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్‌లో సీడీపీ నిధులతో నూతనంగా బోర్‌వెల్ పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్ ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జడ్‌పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు లాల్‌మహ్మద్, మల్లేశ్, మసూద్, నవాబ్, విజయ్ రెడ్డి పాల్గొన్నారు.

పదోన్నతులు పొందిన సీఐలకు పోస్టింగ్

గచ్చిబౌలి, జనవరి 3: ఎస్‌ఐల నుంచి ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతిపొందిన 19 మందికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య పోస్టింగ్ ఇచ్చారు. మాదాపూర్ జోన్ ఎస్‌ఓటీలో పని చేసిన కొక్కొండ బాలరాజుని శంషాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. హైదరాబాద్ కమిసనరేట్ నుంచి వచ్చిన దాసరి రాజు అశోక్‌ను రాజేంద్రనగర్ అదనపు సీఐగాను, శంషాబాద్ జోన్ ఎస్‌ఓటీలో పని చేసిన ప్రవీణ్ రెడ్డిని అదే స్థానంలో కొనసాగించారు. కేపీహెచ్‌బీ పీఎస్‌లో పని చేసిన ఎన్. తిరుపతిని డీఐ బాలనగర్‌కు, గచ్చిబౌలిలో పని చేస్తున్న కే.నవీన్ కుమార్‌ని నార్సింగ్ అదనపు సీఐగా నియమించారు. చందానగర్‌లో పని చేసిన సైదులుని మాదాపూర్ డీఐగాను, టీఎస్ ట్రాన్స్‌కోలో విధుల నిర్వహిస్తున్న పీ.నరేష్‌ని కంట్రోల్ రూమ్‌కి, కూకట్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్‌ని కేపీహెచ్‌బీ అదనపు ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కూకట్‌పల్లి ట్రాఫిక్‌లో పని చేస్తున్న మొగిలిచెర్ల రవిని మాదపూర్ ట్రాఫిక్‌కు, టీఎస్‌ఆర్‌టీసీ నుంచి వచ్చిన హనుమంతుకి మైలార్‌దేవుపల్లి అదనపు సీఐగా, నార్సింగ్‌లో పని చేస్తున్న వీరాజల సుధీర్ కుమార్‌కు సీసీఎస్ మాదాపూర్‌కు బదిలీ చేశారు. మాదాపూర్ జోన్ ఎస్‌ఓటీలో విధలు నిర్వహిస్తున్న వలపూల శివకుమార్‌ని సైబర్ క్రైమ్‌కు, సైబర్ క్రైమ్‌లో పని చేస్తున్న కే. శ్రీనివాస్‌ని అక్కడేనే కొనసాగాలని, కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న మహేష్ గౌడ్‌ని కూకట్‌పల్లి అదనపు ఇన్‌స్పెక్టర్‌గా అతనితో పాటు పీసీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.్భపతిని బాలనగర్‌కు, సైబర్ క్రైమ్‌లో పని చేస్తున్న యాదయ్య గౌడ్‌ని మాదాపూర్‌కు, చందానగర్‌లో పని చేస్తున్న టంగుటూరి శ్రీనివాస్‌ని ఆల్వాల్‌కు, వికారాబాద్ నుంచి వచ్చిన డీ.దాసృకి రామచంద్రపురానికి, గచ్చిబౌలిలో సీహెచ్ రామయ్యని అదే పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవంతానికి సన్నద్ధం

తాండూరు, జనవరి 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆశయం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం విజయవంతానికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా, ఐకేపీ సిబ్బంది, వార్డుల ఆర్పీలు సన్నద్ధం కావాలని మున్సిప చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ పేర్కొన్నారు. బుధవారం తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, మున్సిపల్ మేనేజర్ ఏ.రాములు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విక్రం సింహారెడ్డితోపాటు, ఇతర విభాగాలతో సమావేశం నిర్వహించారు. సునీత మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ను జనవరి మొదటి వారం నుంచి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పారిశుద్ధ్యం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 90 శాతం పూర్తయిందని చెప్పారు. మిగిలిన 10 శాతం మంది పేదలు, సామాన్య కుటుంబాల ప్రజలు కొన్ని అనివార్య కారణాలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వెనకబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణాలకు స్థలం లేని వారికి ఆయా ప్రదేశాలలో సామూహికంగా మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించాలని అన్నారు. డబ్బుల కొరతతో నిర్మాణాలు చేపట్టని పేదలకు డ్వాక్రా మహిళా గ్రూపులలో ఉన్నవారికి సమైక్య నిధుల నుంచి అప్పులు ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణాలకు కృషిచేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని ఇళ్లకి కరెంటు, తాగునీరు, పింఛన్లు, డ్వాక్రా పొదుపు సంఘాల సబ్సిడీ రుణాలు కట్ చేయిస్తామని హెచ్చరించారు.
జనవరి 15 నాటికి పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఓడీఎఫ్ సాధించేందుకు ఆఖరి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

ఓటరు జాబితాను సరి చేయాలి

జీడిమెట్ల, జనవరి 3: ఓటరు జాబితాలో అవకతవకలను సరిచేయాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదుట నియోజకవర్గంలో ఓటరు జాబితాలో జరిగిన అవకతవకల పై కూన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలగించిన ఓట్లను జాబితాలో చేర్చాలని నినాదాలు చేశారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏడు లక్షల ఓట్లు ఉంటే వాటిలో జియో ట్యాగింగ్ పేరుతో బీఎల్‌ఓడ్ల్యు అధికారులు ఇంటింటికీ తిరగకుండా ఇష్టానుసారంగా ఓట్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కారణం లేకుండా ఓట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజమైన తొలగించిన ఓట్లను జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఉపకమిషనర్ సుదాంశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రావన్‌కుమార్, లక్ష్మారెడ్డి, శ్యామ్, పూలమ్మ, భాస్కర్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఎండీ ఖాజా, మల్లారెడ్డి, శాకీర్, బుచ్చిరెడ్డి, కట్టాకుమార్, శ్రీను, రమేశ్, రాజేందర్ రెడ్డి, సూర్యప్రభ, లక్ష్మి, అరుణారెడ్డి పాల్గొన్నారు.

మహిళా లోకానికి సావిత్రిబాయి ఆదర్శీం

చేవెళ్ల, జనవరి 3: నేటి మహిళా లోకానికి సావిత్రిబాయి ఆదర్శమని చేవెళ్ల ఆదర్శ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టేనావతి అన్నారు. బుధవారం సావిత్రిబాయి జయంతి సందర్భంగా చేవెళ్ల ఆదర్శ పాఠశాలలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా నాయకులు నాగని, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ వెంకట స్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు సుదర్శన్, యాదయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
సికిందరాబాద్: మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సికిందరాబాద్‌లోని మెట్టుగూడలో రజక మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డు గ్రహీత మల్లీశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సమాజోద్ధరణకు ఎన్నో త్యాగాలకు ఎదుర్కొని నిలిచి నిరంతరం పరితపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన తరగతుల మహిళల అక్షరాస్యతకు నాడు చూపిన తెగువ నేడు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని కొనియాడారు. మల్లీశ్వరి రాజేశ్వరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క మహిళ అక్షరాస్యతను సాధించడంతోపాటు అన్ని రంగాల్లో ఉత్తమంగా రాణించాలని పేర్కొన్నారు.
ఉప్పల్: సామాజిక దురాచారాలను వివక్షలను ప్రశ్నించిన మొట్టమొదటి వీర వనిత సావిత్రిబాయి పూలే అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.్ధర్మేంద్ర, అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టీ.సత్యప్రసాద్ అన్నారు. బుధవారం ఉప్పల్‌లోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉప్పల్ కార్యదర్శి సాయినాథ్, స్టీపెన్, దుర్గాప్రసాద్, మహేష్, శివకుమార్, అరవింద్ పాల్గొన్నారు
టీ-మాస్ ఫోరమ్ ఆధ్వర్యంలో
తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక టీ-మాస్ ఫోరమ్ ఉప్పల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిల్కానగర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీ-మాస్ ఫోరమ్ కమిటీ చైర్మన్ అశోక్, నేతలు స్వామి, సాయిలు, లక్ష్మణ్, రాజు గౌడ్,అ అంజయ్య, రాములు, పద్మ, బల్‌రామ్, అశోక్‌చారి, లక్ష్మినారాయణ, చలపతి, నర్సింగ్ రావు, రాంచందర్, చోటేమియా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వికారాబాద్: స్ర్తిల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే కృషి మరువలేనిదని టీమాస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సాధుసత్యనాధన్ కొనియాడారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 24, 25, 26 తేదీల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా, వంటావార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బాలాపూర్: ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరని, ఆమె దేశంలో తొలి ఉపాధ్యాయురాలు అని బాలాపూర్ మండల టీడీపీ అధ్యక్షుడు ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ కొనియడారు. బుధవారం సావిత్రిబాయి పూలే 187వ జయంతిని పురష్కరించుకొని.. బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి చిత్రపటానికి మల్లేష్ ముదిరాజ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. రంగారెడ్డి జిల్లా కుల నిర్మూలన సమితి నాయకుడు దాసరి బాబు, మీర్‌పేట్ టీడీపీ అధ్యక్షుడు ముత్యాల వాసుసాగర్, సుందరయ్య, కిషన్ పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్: సావిత్రిబాయి పూలే 187వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కొత్తూరు, నందిగామ మండలాల్లో సావిత్రిబాయి పూలే జయంతి సంధర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తూరులో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర యూత్ కార్యదర్శి వీరమోని దేవేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీ.రాజప్ప, శ్రీనివాసులు, యాదయ్య, మంగలి జంగయ్య, రాములు, పాండు, జ్యోతి, కృష్ణవేణి పాల్గొన్నారు.
కొందుర్గు: సావిత్రిబాయి పూలే 187వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలోని దళితవాడ, బాలిక ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం ప్రేమ్‌సాగర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఎస్‌టిఎఫ్‌ఐ నాయకురాలు సంయుక్త, ఉపాధ్యాయులు ఉషశ్రీ, సంగీత, శ్రీ్ధవి, బాలమణి పాల్గొన్నారు.
షాబాద్: సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీపీ జ్యోతి, జడ్ప్‌టీసీ లక్ష్మీ, పీఏసీఎస్ చైర్మన్ అవినాష్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మెన్ వెంకటయ్య, మండల అభివృద్ధి అధికారిణి పద్మావతి, ఉపాధ్యాయురాలు ఝాన్సీ, సర్పంచ్ వెంకట్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, మల్లేష్ పాల్గొన్నారు.
కుషాయిగూడ: స్ర్తి ఉద్ధరణ లక్ష్యంగా అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని అక్షర పోరాటం చేసిన మహానీయురాలు సావిత్రీ బాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని మేడ్చల్ జిల్లా ఏఐవైఏఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలను చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గప్రసాద్, సుమతి, అర్చన, మానస, మహేష్, రజినీ, భవిత, శాంతి, సృజన పాల్గొన్నారు.
షాద్‌నగర్: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మాజీ శాసనసభ్యుడు చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన మహా నాయకురాలు సావిత్రిబాయి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో పురపాలిక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి, విజయ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, వై.యాదయ్య యాదవ్, కృష్ణారెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, బాబు నాయక్, ఆకుల వీరేశం పాల్గొన్నారు.
సావిత్రిబాయిని ప్రతి మహిళా ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం షాద్‌నగర్‌లో సావిత్రిబాయి జయంతి సంధర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శ్రీను, విజయ్, అనిల్, మహేష్, రాజు, రాజేష్, రమేష్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు చెంది మహేందర్ రెడ్డి, నందిగామ మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, సిద్దెల శ్రీనివాస్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రేడ్-1శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని గ్రేడ్-1శాఖ గ్రంథాలయంలో చైర్మన్ లక్ష్మీనర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, గ్రంథాలయ అధికారి మునేశ్వర్, జానకిరాములు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శంకర్, జాంగారి నర్సింలు, జంగరాజు, యాదయ్య, రాంచంద్రయ్య, రవూఫ్, రాజు, మనోహర్‌రాజు, శేఖర్ పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులు గిరి, ప్రశాంత్, ఈశ్వన్ నాయక్, శివ, సోను, శ్రీకాంత్, శివ, రమేష్, బోణి, అవినాష్ పాల్గొన్నారు.
సావిత్రిబాయి జయంతి వేడుకలు ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జనార్ధన్, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, అరుణ, మాణిక్‌ప్రభు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తాలుకా అధ్యక్షుడు జీ.రాములు గౌడ్, రాజు గౌడ్, గిరి, మధు, మహేష్, అశోక్ యాదవ్, ఈశ్వర్, ప్రశాంత్, శరత్ యాదవ్ పాల్గొన్నారు.
కాచిగూడ: బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే అని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన రావు అన్నారు. సావిత్రి బాయి పూలే జయంతి సభ ప్రైవేటు టీచర్స్ అసోసియోషన్, ఆత్మీయ సంస్కృతిక సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణ మోహన్ సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ రచయిత డా. ఆత్మీయ నిర్మల సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో జస్టిస్ చంద్ర కుమార్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నోముల మల్లేష్, ప్రైవేటు టీచర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు డా.పీ.బడేసాబ్, ప్రధాన కార్యదర్శి పీ.శంకర్ పాల్గొన్నారు.
పరిగి: పరిగిలోని అమర వీరుల చౌరస్తాలో టీజేఏసీ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పులే జయంతిని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలని, అధికారికంగా నిర్వహించాలని నాయకులు కోరారు. పరిగి జేఏసీ చైర్మన్ నాగేశ్వర్, టీవీవీ ప్రధాన కార్యదర్శి వెంకట రాములు, డీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొగులయ్య, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి గోవింద్ నాయక్, మాణిక్యం, రవికుమార్ పాల్గొన్నారు.
మేడ్చల్: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బుధవారం మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టంలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. టీ-మాస్, రాష్ట్ర అంబేద్కర్ సంఘం (టీఆర్‌ఏఎస్) ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జడ్పీటీసీ శైలజ హరినాథ్, తుమ్మ భూమన్న, నర్సింహా, నరేందర్, ఎర్ర విజయ్ రావు, లక్ష్మారెడ్డి, రామస్వామి, కమాలోద్దీన్, జయమ్మ, లక్ష్మీ, చంద్రశేఖర్, మహేశ్, టీ-మాస్ సభ్యులు శ్రీహరి చారి, సుధాకర్ రెడ్డి, ఎర్ర అశోక్, పీ.ఆంజనేయులు, బీ.్భస్కర్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మండలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరుపుకున్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం మహిళాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలని మండల విద్యాధికారి రాంరెడ్డి అన్నారు.
చార్మినార్: మహిళలకు చదువుకునే అవకాశం కల్పించాలంటూ మొట్టమొదటిసారిగా విద్యాహక్కుకు పోరాడిన వీరవనిత సావిత్రిబాయి పూలే మహిళలందరికీ ఆదర్శమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకురాలు మర్క నవీన కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించేందుకు బీసీ మహిళలకు సబ్ కోటాను కేటాయించాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంఘం నేతలు భూపేశ్ సాగర్, నంద గోపాల్, ఎస్, రామలింగం, పేగరి సురేశ్, పద్మావతి, రాధిక, వనజ, రమ్య పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: మహిళల చదువు కోసం కులమతాలకు అతీతంగా పోరాటం చేసిన మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ విల్సన్ అన్నారు. సావిత్రి బాయిపూలే జయంతి సందర్భంగా బుధవారం జేఎన్‌టీయూలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఎస్‌సీ, ఎస్‌టీ అధికారి బలరాం నాయక్, జేఎన్‌టీయూ కో-అర్డినేటర్ ఎన్‌ఎస్‌ఎస్ సమ్ములాల్, ప్రొఫెసర్ రూప్‌సింగ్, స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల భిక్షపతి, రమేష్, శ్రీనివాస్, గోవర్దన్, ప్రశాంత్, అర్జున్, మహిళలు సంధ్య, అఖిల, ప్రశాంతి పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ
కీసర: సావిత్రిబాయి పూలే మహిళాలోకానికి కలికితురాయి అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కీసర మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, సర్పంచ్ గణేశ్, ఉపసర్పంచ్ ఆర్. శ్రావణ్‌కుమార్, ఎంఈఓ శశిధర్, ఎంపీటీసీలు రమేశ్‌గుప్తా, జంగయ్య యాదవ్, ఉపాధ్యాయులు శ్రీ్ధర్, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈఎస్‌ఎస్ పురోగతిపై జేసీ సమీక్ష

హైదరాబాద్, జనవరి 3: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న పథకాల ద్వారా 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి మిగిలిపోయిన యూనిట్లను వారం నుంచి పక్షం రోజుల్లో గ్రౌండ్ చేయాలని జిల్లా ఇన్‌చార్జి జేసీ నిఖిల అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో బుధవారం ఎకనామిక్ సపోర్టు స్కీం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 సంవత్సరానికి గాను కేవలం 19 యూనిట్లు గ్రౌండింగ్‌కు మిగిలి ఉన్నాయని, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయని, వీటన్నింటిని వారం రోజుల వ్యవధిలో గ్రౌండ్ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
ఏవైనా ఇబ్బందులుంటే ఎల్‌డీఎంను వ్యక్తిగతంగా సంప్రదించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరం 236 యూనిట్లు లక్ష్యం కాగా, 629 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని గ్రౌండ్ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మంజూరు చేసిన యూనిట్లు, సబ్సిడీ విడుదల చేసిన యూనిట్లు వంటి పూర్తి వివరాలను వెంటనే తనకు అందజేయాలని ఆదేశించారు. సమీక్షలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ హన్మంత్ నాయక్, బీసీ అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి డీడీ మంజుల, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరిదేవి పాల్గొన్నారు.
వైద్యారోగ్యశాఖ ద్వారా స్టేట్ పాపులేషన్ పాలసీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి జేసీ నిఖిల ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇండెమినిటీ స్కీంపై ఏర్పాటైన జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు, నిర్వహించినపుడు దురదృష్టవశాత్తు రోగి మృతి చెందితే ఇండెమినిటీ స్కీం కింద వారి కుటుంబాలకు రూ. 2లక్షల, శస్తచ్రికిత్స ఇనర్వహించిన వారం తర్వాత నెల లోపు మృతి చెందితే రూ. 50వేలు, ఆపరేషన్ ఫెయిలైతే రూ.