హైదరాబాద్

వెనుకబడిన తరగతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ఆదుకుంటుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం, కమిషనర్ అనితా రాజేంద్ర పాల్గొన్నారు. ఎంబీసీల సర్వతోముఖాభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని చెప్పారు. నారుూబ్రాహ్మణులు, రజకులు, విశ్వబ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం మాట్లాడుతూ పేద వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం కల్యాణలక్ష్మి అందిస్తున్నామని అన్నారు. ఓవర్‌సీస్ విద్యా నిధి పథకం ద్వారా బీసీ విద్యార్థులకు విదేశాలలో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. జనవరి 30 లోగా జిల్లా అధికారులు దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించారు. వెనుకబడిన తరగతుల స్టడీ సర్కిల్‌లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి విద్య పాల్గొన్నారు.

భారీగా గుట్కా స్వాధీనం

హైదరాబాద్, జనవరి 12: నగరంలో కల్తీ గుట్కా విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. టోలిచౌక్‌లోని తవకాల్ చాలియా స్టోర్‌లో కల్తీ గుట్కా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు టాస్క్ఫోర్స్ డిసిపి తెలిపారు. వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని డిసిపి రాధా కిషన్‌రావు తెలిపారు. మహ్మద్ షాబాద్, మహ్మద్ అబ్దుల్ మోయిద్‌లను అరెస్టు చేయగా, ఎస్‌ఏ కరీం, పురుషోత్తమ్‌లు పరారీలో ఉన్నారని తెలిపారు.