హైదరాబాద్

‘స్వచ్ఛ’ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: స్వచ్ఛతపై విద్యార్థులు చైతన్యవంతులైతే, వారి కుటుంబ సభ్యుల్లో కూడా మార్పు వస్తోందని భావించిన జీహెచ్‌ఎంసీ.. విద్యార్థులకు స్వచ్ఛ పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోనూ స్వచ్ఛ కమిటీలను నియమించింది. అన్ని పాఠశాలల్లో తరగతుల ప్రారంభానికి ముందు నిర్వహించే ప్రార్థనలో భాగంగా ఆ పాఠశాల స్థానిక మెడికల్ ఆఫీసర్, ఎంటమాలజీ అధికారులు స్వచ్ఛ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం మొదలైంది. ఇంట్లోనే చెత్తను తడి,పొడిగా వేరు చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, దోమల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 20శాతం పాఠశాల్లో తరగతుల వారీగా స్వచ్ఛ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ప్రతి తరగతిలో స్వచ్ఛ కమిటీలను, వాటికి ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీతో పాటు ఆరుగురు సభ్యులను నియమించనున్నారు. ప్రతి నెల కమిటీ సభ్యులు మారుతూ ఉంటారని పేర్కొన్నారు. ఒకే క్లాసులో 30 మంది విద్యార్థులుంటే వచ్చే నాలుగు నెలల్లో ప్రతి ఒక్కరికీ ఈ కమిటీలో స్థానం దక్కి చైతన్యనవంతులు అవుతారని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. చెత్తను తడి, పొడిగా వేర్వేరు చేయటంతో పాటు తమ ఇంట్లో వేరు చేయించి స్వచ్ఛ ఆటో టిప్పర్ల డ్రైవర్లకు అందించటంతో పాటు తల్లిదండ్రులను, ఇరుగుపొరుగుని చైతన్యపరిచే విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి ప్రశంసాపంత్రాలను అందజేస్తున్నారు. నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రగామికి నిలిపేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.