హైదరాబాద్

బల్దియాలో ‘స్వచ్ఛ’సీజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం స్వచ్ఛ సీజన్ కొనసాగుతోంది. స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా దేశంలోని మహానగరాలు, పట్టణాలకు స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్వహించే సర్వేలో ఈ సారైనా అగ్రస్థానాన్ని చేజిక్కించుకునేందుకు జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సారి కూడా వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఉన్నందున కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. ఉదయం విధులకు హాజరు కాగానే ‘స్వచ్ఛ నమస్కారం’తో కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. వివిధ పనులకు జీహెచ్‌ఎంసీ కార్యకలాపాలకు వచ్చే వారికి స్వచ్ఛ నమస్కారం, వారు పనులు పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో స్వచ్ఛ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేగాక, సెల్‌ఫోన్లలోనూ చెత్త సంబంధిత ‘స్వచ్ఛ’ కాలర్‌టోన్‌లే విన్పిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీకి చెందిన ఆస్తులు మొదలుకుని టాయిలెట్లపై, మరికొన్ని భారీ హోర్డింగ్‌లపై కూడా స్వచ్ఛ సందేశాలు, నినాదాలు దర్శమిస్తున్నాయి. ఇటీవలే నగరంలో పర్యటించిన కేంద్ర స్వచ్ఛ్భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ బృందం నగరాన్ని ఓడీఎఫ్ సిటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇదే స్పూర్తితో అధికారులు ప్రజలను, కాలనీ సంక్షేమ సంఘాలను, సెలబ్రిటీలను సైతం భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జోన్ల వారీగా నిర్వహిస్తున్న స్వచ్ఛ అవగాహన కార్యక్రమాలకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలతో పాటు స్థానిక కార్పొరేటర్లు కూడా పాల్గొంటున్నారు. అంతేగాక, దేశంలో ఏ కార్పొరేషన్‌లో లేని విధంగా ఇంట్లోనే చెత్తను తడి,పొడిగా వేరు చేయాలన్న విషయంపై ప్రతి కుటుంబంలో అవగాహన పెంచేందుకు ‘స్వచ్ఛదూత్’లను నియమించారు. ప్రతి ఇంటి నుంచి చెత్త తడి,పొడిగా వేర్వేరుగా సేకరించేందుకు ఇప్పటికే 44 లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసి, చెత్తను తరలించేందుకు 2వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చినా, ఆశించిన ఫలితం దక్కకపోవటంతో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే విధంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రస్తుతం ప్రతి పాఠశాలలో స్వచ్ఛకమిటీలను నియమిస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఇరవై శాతం పాఠశాలల్లో స్వచ్ఛ కమిటీలను నియమించిన జీహెచ్‌ఎంసీ అధికారులు విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు.