హైదరాబాద్

22న జిల్లా స్థాయి పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: 8వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జూనియర్, సీనియర్ విభాగాల్లోని విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను ఈ నెల 22న సీఈఓ మీటింగ్ హాలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాలలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులందరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 24న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు ఈ నెల 25న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని స్పూర్త్భివన్‌లో నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు.