హైదరాబాద్

బస్‌బేల నిర్మాణానికి స్థలాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న బస్ బేల నిర్మాణానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు స్థలాలను కేటాయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బీ. జనార్దన్ రెడ్డి సూచించారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో మొదటి దశగా 55 ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణానికి స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ స్థలాల కేటాయింపునకు సంబంధించి కమిషనర్ శనివారం 18 శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మరింత మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి బస్ బేల నిర్మాణానికి ప్రత్యేకంగా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేశామని, ఈ స్థలాల్లో బస్ బేలను నిర్మించటం ద్వారా రహదారులపై కాకుండా బస్సులు ఒకవైపు ఆపటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండటంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
అతి తక్కువ స్థలానే్న సేకరిస్తున్నామని, ఈ విషయంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రాథమిక సర్వే కూడా నిర్వహించారని వివరించారు. నగరంలో అటవీశాఖకు చెందిన మూడు స్థలాలు, విద్యాశాఖకు చెందిన ఎనిమిది, రెవెన్యూ శాఖకు చెందిన మరో ఎనిమిది, వ్యవసాయశాఖకు చెందిన మూడు, వైద్యారోగ్యశాఖకు చెందిన మూడు, హోంశాఖకు చెందిన ఆరు, జలమండలికి చెందిన నాలుగు, పరిశ్రమల శాఖకు చెందిన మూడు, హౌజింగ్‌కు చెందిన ఐదు, మైనార్టీ, ఆర్టీసి, హెచ్‌ఎండీఏలకు చెందిన రెండు స్థలాలు చొప్పున, సర్వే ఆఫ్ ఇండి, ఎఫ్‌సీఐ, ఆలైడ్ ఇన్ఫ్రా, టీఎస్‌ఐఐసీలకు చెందిన ఒక్కో స్థలాన్ని గుర్తించామని తెలిపారు. ప్రజల ఉపయోగం, సౌకర్యం నిమిత్తం ఈ స్థలాల్లో బస్ బేలను నిర్మించటానికి వీలుగా ఆ స్థలాలను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.