హైదరాబాద్

పోలియో రహిత జిల్లా రంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా చేయాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ సిబ్బందిని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం పల్స్ పోలియో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో జనవరి 28న నిర్వహించే జాతీయ పల్స్ పోలియో గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. జిల్లాలో 452 కేంద్రాలు నగర వాడలలో, 1148 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 1600 పోలియో కేంద్రాలు ఏర్పాటుచేసి 3,34,531 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ జీఆర్ గజేశ్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లారెడ్డి, పోలీస్ అధికారులు, విద్యుత్, డీపీఓ, డీఆర్డీఓ, డీఈఓ, మున్సిపల్ కమీషనర్‌లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

పంజాగుట్ట ఠాణాను సందర్శించిన యువ ఐపీఎస్‌లు
ఖైరతాబాద్, జనవరి 20: జాతీయ స్థాయిలో రెండో బహుమతి అందుకున్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను యువ ఐపీఎస్ అధికారులు శనివారం సందర్శించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రాజేష్ చౌహాన్, పీ.సాయి చైతన్య, శరత్ సేష్టన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రవీందర్ స్టేషన్‌లో అందుతున్న సేవలను వివరించారు. ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతిక పద్ధతిలో స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు, సీసీ కెమెరాల నిర్వహణ, వివిధ కారణాలతో స్టేషన్‌కు వచ్చేవారికి పోలీసులు ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నారు, ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర విషయాలను వివరించారు.