హైదరాబాద్

పాతబస్తీలో అమలు కాని ప్లాస్టిక్ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: మహా నగర ప్రజలకు పౌర సేవలను అందించటంతో పాటు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపు, పాలక మండలి నిర్ణయాలతో మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓల్డ్ సిటీ, న్యూ సిటీలకు రెండు చట్టాలు అమలవుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంతో రాష్ట్రంలో సత్సంబంధాలు కల్గిన మజ్లీస్ పార్టీ స్వరాష్ట్రంలోనూ అధికార పార్టీతో అవగాహన ఒప్పందంతో ముందుకెళ్తున్నందున పాతబస్తీలో ఆ పార్టీకి తెలియకుండా బల్దియా ఎలాంటి నిబంధనలైనా అమలు చేయలేకపోతుంది. జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ కూడా ఆ పార్టీ నేతల కనుసన్నల్లో రూపుదిద్దుకుంటుందన్న చర్చ సైతం లేకపోలేదు. మేయర్, కమీషనర్, పాలక మండలి ఏ నిర్ణయాలు తీసుకున్నా, వాటిని న్యూ సిటీలో అమలు చేయటంలో చూపుతున్న శ్రద్ధను, చొరవను అధికారులు పాతబస్తీలో అమలు చేయటంలో చూపటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేల కోట్ల పనులు జరుగుతున్నట్లు చెబుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులు పాతబస్తీలో సక్రమంగా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సుల ఫీజులను వసూలు చేసుకోలేకపోతున్నారు. రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని ఏకంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసినా, కనీస చర్యలు తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బల్దియాలోని వివిధ ఉన్నతమైన హోదాల్లో వచ్చే అధికారులకు పాతబస్తీపై అవగాహన లేకపోవటం వల్లే ఏ నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోవటం లేదనే వాదన ఉంది. గతంలోనే పాలకమండలి, ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం ప్రస్తావనకు వస్తే న్యూసిటీలో అమలైన విధంగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం పాతబస్తీలో ఎక్కడా కూడా అమలు కావటం లేదు.
చారిత్రక కట్టడం చార్మినార్ చార్మినార్ చుట్టూ ప్రతిరోజు వేలాది మంది తోపుడు బండ్ల వ్యాపారస్తులు 50 మైక్రాన్ల తక్కువగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తున్నా, పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. చార్మినార్ నుంచి కేవలం కూతవేటు దూరంలోనే గ్రేటర్ బల్దియా సౌత్ జోన్ కార్యాలయం సర్థార్ మహాల్ ఉన్నా, అక్కడి అధికారులు చార్మినార్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నా, ప్లాస్టిక్ వినియోగాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పట్ల ప్రశ్నిస్తే స్థానికంగా రాజకీయంగా ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతోనే అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణ ఉంది.