హైదరాబాద్

శివార్లకు సిటీతో సమానంగా నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: సిటీలో జరుగుతున్న నీటి సరఫరాకు సమానంగా శివార్లలో కూడా రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేయనున్నట్లు జలమండలి ఎండీ దాన కిషోర్ వెల్లడించారు. మల్కాజ్‌గిరిలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులను ఎండీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతంనగర్, తిరుమల్‌నగర్, వౌలాలీ డిఫెన్స్‌కాలనీలో నిర్మించిన రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. వాజ్‌పేయినగర్ రిజర్వాయర్ వద్ద జరుగుతున్న టనె్నలింగ్ పనులను, తిరుమల్‌నగర్ కొండపై నిర్మించిన రిజర్వాయర్ ఔట్‌లెట్ పనులను కూడా సందర్శించారు. నెల 20వ తేదీన నిర్వహించిన మీట్ యువర్ ఎండీ కార్యక్రమంలో వౌలాలీ ప్రాంతం నుంచి తక్కువ ప్రెషర్‌తో మంచినీటి సరఫరా జరుగుతుందని వచ్చిందంటూ ఫిర్యాదు చేసిన వినియోగదారుడి ఇంటికి వెళ్లి, ఆయన్ను వ్యక్తిగతంగా కలిశారు. తిరుమల్‌నగర్ రిజర్వాయర్, వాజ్‌పేయినగర్ టనె్నలింగ్ పనులు పూర్తయితే శివార్లకూడా నగరం సమానంగా మంచినీటి సరఫరా చేసేందుకు అవకాశముంటుందని వివరించారు.
హడ్కో ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. హాడ్కో ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులను ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రోడ్డు పక్కన జరుగుతున్న పనుల వద్ద ఎలాంటి ప్రమాదాలు సైతం జరగకుండా చేపట్టిన చర్యలను సైతం ఎండీ తనిఖీ చేశారు.
మల్కాజ్‌గిరి మంచినీటి సరఫరా పథకం రోడ్డు పునరుద్దణ పనులకు సంబంధించి వివరాలను బోర్డు, జీహెచ్‌ఎంసీల వారీగా అందజేయాలని ప్రాజెక్టు విభాగం అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎండీతో పాటు జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ పి.రవి, సర్కిల్ 4,5సీజీఎం ఎం.బి.ప్రవీణ్‌కుమార్, పీసీసీ-3 సీజీఎం పి.వెంకటేశ్వర్‌రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.