హైదరాబాద్

కొత్త బస్ షెల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: మహానగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కనుమరుగైపోయిన బస్ షెల్టర్ల స్థానంలో జీహెచ్‌ఎంసీ ఆధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 826 మోడ్రన్ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తోంది. ఇదివరకున్న విధానానికి ఈసారి కాస్త భిన్నంగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) అనే సరికొత్త విధానంతో కార్పొరేషన్‌పై పైసా భారం పడకుండా ప్రయాణికులకు ఈ ఆధునిక బస్ షెల్టర్లను అందుబాటులోకి తేనుంది. ఈ ప్రతిపాదనకు గత నెల 12వ తేదీన కౌన్సిల్ ఆమోదం తెలపగా, ఈనెల 22న టెండర్లను ఖరారు చేసింది. నాలుగు క్యాటగిరీలుగా నాలుగు సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇందులో మొదటి ప్యాకేజీ కింద యునీ యాడ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 214 బస్ షెల్టర్లను ఏర్పాటుచేసే బాధ్యతలను అప్పగించగా, ప్యాకేజీ రెండులో ప్రకాశ్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 219, ప్యాకేజీ మూడు కింద యునియాడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 194, ప్యాకేజీ నాలుగు కింద కేకేఆర్‌సీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 199 బస్ షెల్టర్లను ఏర్పాటుచేసే బాధ్యతలను అప్పగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నాలుగు సంస్థలు ఏర్పాటు చేయనున్న మొత్తం 826 బస్ షెల్టర్లను సైతం నాలుగు గ్రేడ్‌లుగా విభజించారు. ఇందులో గ్రేడ్ 1 కింద 200 అడుగులు, 30 అడుగులతో ఒక్కో అత్యాధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో డస్ట్‌బిన్, మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్, ఏటీఎం, కాఫీ, వైఫై, ఎయిర్ కండీషన్, ఫ్యాన్, సీసీటీవీ, టికెటింగ్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రేడ్ 2 కింద ప్రొఫిషెంట్ బస్ షెల్టర్లను ఒక్కోదాన్ని 25 అడుగులు, 8 అడుగులతో ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్ 1లో ఉన్న అన్ని సౌకర్యాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్ 3 కింద బేసిక్ బస్ షెల్టర్లను 20 అడుగులు, ఐదు అడుగులతో ఏర్పాటు కానున్న ఈ షెల్టర్లలో ఫ్యాను, టికెట్ మిషన్ మినహా మిగిలిన సదుపాయాలన్నీ ఉంటాయి. గ్రేడ్ 4 కింద మినిమల్ బస్ షెల్టర్‌ను ఒక్కోదాన్ని 10 అడుగులు, ఐదు అడుగులు, మూడు అడుగుల సైజులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో కేవలం డస్ట్‌బిన్లు, సీసీటీవీలు మాత్రమే ఉండేలా వీటిని డిజైన్ చేయనున్నారు. ఇందులో బేసిక్ బస్ షెల్టర్‌లో సిట్టింగ్, లైటింగ్, ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సైడ్‌వాక్, ర్యాంపు వంటివి ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ సంస్థలకు సూచించింది.