హైదరాబాద్

నగరంలో పడకేసిన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: విశ్వనగరం అంటూ హైదరాబాద్‌ను సమస్యలతో విషాద నగరంగా మార్చివేశారని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం సికిందరాబాద్ లాలాగూడలోని తుకారాంగేట్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణాన్ని చేపట్టాలని సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమాలను బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టారు. లక్ష్మణ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ తెస్తామంటున్న ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అమరవీరు కుటుంబాలను పట్టించుకోకుండా, అడుగడుగునా అడ్డంపడ్డ వారికి పాలకులు పెద్దపీట వేశారని ఆరోపించారు. సీఎం రోజుకో హామీ, పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను ఊహాలోకాల్లో విహరింప జేస్తున్నారని, నాలుగు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి శూన్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు. సికిందరాబాద్ తుకారాంగేట్ రైల్వేట్రాక్ వద్ద ఆర్‌యూబీ త్వరగా నిర్మించాలంటూ చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తుందని, ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించ లేదని, కేంద్రం నిధులు ఇచ్చినా పనులు ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంఎంటీఎస్ రెండోదశ పనులు వేగవంతంగా చేయాలని కేంద్రం సంకల్పించి నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటాను విడుదల చేయడం లేదని, యాదాద్రి వరకు పొడిగించాలనే డిమాండ్‌ను కేంద్రం అంగీకరించినా స్పందన లేకపోవడం దారుణమని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సికిందరాబాద్‌లో ఆర్‌యూబీ నిర్మాణాన్ని పెండింగ్‌లో ఉంచడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్.. పాలనను ప్రక్కనపెట్టి విదేశీ పర్యటనలతోనే సరిపెడుతున్నారని విమర్శించారు.
నగరంలో గుంత కనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారని, నేడు ఆ గుంతల సమాచారం ఇచ్చేవారికి డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తెరాస పాలన నడవడం లేదని, ఓవైసీకి ఏమి చూపించారో తెలియదు, కానీ, ఒకటే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి రాని సీఎం.. కొత్తగా మరో సచివాలయం కట్టి ఏమి చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందికరంగా, యేళ్ల తరబడి అమలుకు నోచుకోని పనులను సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు.