తెలంగాణ

రక్తమోడిన రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి/ కొత్తకొట, ఫిబ్రవరి 21: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టగ్రామ శివారులో గల 44వ జాతీయ రహదారిపై బుదవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా జాతీయ రహదారి శ్మశానాన్ని తలపించింది. చెల్లాచెదురై పడ్డ మృతదేహాలు, కార్లలో ఇరుక్కపోయిన మరికొన్ని మృతదేహాలు అక్కడి వాతావరణాన్ని భయానకంగా మార్చేశాయ. హైద్రాబాద్ నుండి చిన్నచింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో జరిగే జాతరకు 10 వాహనాల్లో బయలుదేరగా అందులోని టిఎస్ 08 యుఎ 3801 అనే మహేంద్రా క్యాబ్ ముందు టైరు ప్రమాదవ శాత్తూ పేలిపోవడంతో, వాహనం డివైడరును ఢీకొని ఆవల వెళ్తున్న టిఎస్ 08 ఇఎ 8108 నంబరుగల కారును ఢీకొట్టింది. మహేంద్ర వాహనంలో ఆరుగురు ప్రయాణిస్తుండగా ఐదుగురు మృతి చెందారు. కర్నూలు నుండి హైద్రాబాద్‌కు వెళ్తున్న అవతలి వాహనంలో ఐదుగురిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతిచెందిన వారిలో గోపన్‌పేట గ్రామానికి చెందిన భీరప్ప (26), అజ్జకోలు గ్రామానికి చెందిన రాజు (38), మూలమల గ్రామానికి చెందిన మల్లేష్ (28), ఆంజనేయులు (40), నరేష్ (35), కర్నూలుకు చెందిన సూరిబాబు (45), ప్రసన్న (70), రాజేశ్వరమ్మ (60), సునీత (40) ఉన్నారు. మస్తీపురం గ్రామానికి చెందిన మోగిలన్న, కర్నూలుకు చెందిన కల్పన తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం హైద్రాబాద్‌కు తరలించారు. మృతుల్లో భీరప్ప, మల్లేశ్, రాజు, ఆంజనేయులు, నరేష్‌లు వనపర్తి జిల్లావాసులుకాగా వలస వెళ్లి హైద్రాబాద్‌లో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. కర్నూలు జిల్లా వాసులైన సూరిబాబు కుటుంబానికి చెందిన తల్లి ప్రసన్న, అత్త రాజేశ్వరి, భార్య సునీత మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. విషయాన్ని తెలుసుకున్న జేసీ నిరంజన్, ఏఎస్పీ సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీయంచి, సహాయక చర్యలకు సహకరించారు.