హైదరాబాద్

చెత్త రవాణాకు 350 టిప్పర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: మహానగరాన్ని స్వచ్ఛ నగరంగా, మరింత పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రెండు వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే మరో 350 ఆటోలను పంపిణీ చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ, మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. గురువారం పీపుల్స్ ప్లాజాలో పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖ సీఎస్ అర్వింద్ కుమార్ తదితరులతో కలిసి 150 స్వచ్ఛ ఆటో టిప్పర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎస్ జోషీ మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలను అభినందించారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ 500 ఆటో టిప్పర్లను అదనంగా అందుబాటులోకి తేవాలని జీహెచ్‌ఎంసీ భావించిందని, ఇప్పటికే రిక్షాల్లో చెత్తను సేకరించి, తరలిస్తున్న వారిలో నాలుగు చక్రాల వాహానాలు నడిపేందుకు అవసరమైన లైసెన్సులు కలిగిన 150 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయినందున వారికి 150 టిప్పర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 350 టిప్పర్లను లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. సరికొత్త హంగులతో టాటా కంపెనీ తయారు చేసిన కొత్త ఆటోల్లో అనౌన్స్‌మెంట్ కోసం మైక్, తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు క్యాబిన్ పార్టిషన్, పైన కప్పేందుకు కవర్, ఇన్‌బిల్ట్ ఫిట్టింగ్‌తో తయారు చేసినట్లు వివరించారు. నగరంలోని 20లక్షల గృహాల నుంచి నూటికి నూరు శాతం ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఆటో టిప్పర్ల కార్మికులు మరింత కష్టపడి పని చేయాలని, సిటీని స్వచ్ఛ నగరంగా మార్చేందుకు అందరం సమష్టిగా మేయర్ రామ్మోహన్ పిలుపునిచ్చారు.