హైదరాబాద్

హైదరాబాద్‌పై కేరళ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అండర్-23 మహిళల వనే్డ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో పోటీలకు అతిథ్యమిస్తున్న హైదరాబాద్‌పై మూడు వికెట్ల తేడాతో కేరళ విజయం సాధించింది. నగరంలోని ఏఓసీ మైదానంలో శుక్రవారం కేరళ - హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. కేరళ బౌలింగ్ దాటికి తట్టుకోలేక 48.1 ఓవర్లలో 137 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన జీ.శిరీష 39, డీ.రమ్య 32, రచన కుమార్ 20 పరుగులు సాదించారు. కేరళ బౌలర్‌లు పీ.సౌరభ్య చక్కటి బౌలింగ్ పటిమను ప్రదర్శించి 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, కీర్తి జేమ్స్ 22 పరుగులిచ్చి మూడు వికెట్లు, సంజన 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ బరిలోకి దిగిన కేరళ 48.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఐవీ దివ్య 137 బంతులను ఎదుర్కొని ఎనిమిది బౌండరీల సహయంతో 76 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టు విజయానికి కృషి చేసింది. మ్యాచ్‌లో గెలుపొందదిన కేరళ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి.
ఈసీఐఎల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గోవా రెండు వికెట్ల తేడాతో కర్నాటకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక, గోవా బౌలింగ్‌ను తట్టుకోలేక 37.2 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. కర్నాక బ్యాటింగ్‌లో జీ.దివ్య 30, రామేశ్వరి 33 పరుగులు చేయగా గోవా బౌలర్లు దిక్ష గౌడే 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, సంజుల నాయక్, జీ.ప్రతిక్ష చేరి రెండేసి వికెట్లు పడగొట్టారు. 101 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన గోవా 42.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి విజయల లక్ష్యాన్ని అధిగమించింది. గోవా బ్యాటింగ్‌లో సంజుల నాయక్ 29, పూర్వజ 26 పరుగులు చేశారు. కర్నాటక బౌలింగ్‌లో రాణించిన సహాన పవార్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, జీ.దివ్య 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ గెలిచిన గోవా నాలుగు ప్యాయింట్లు సాధించి ఆదిక్యంలో నిలిచింది.
ఎన్‌ఎఫ్‌సీ మైదానంలో ఆంధ్రా- తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 8 ఇవికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బౌలింగ్‌లో రాణించిన ఎల్.నేత్ర 31 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, రెహమాన్, కేఎన్ రమ్యశ్రీ 8 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. 154 పరుగుల విజయ లక్ష్యాంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన తమిళనాడు 34.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన డీ.హేమలత 97 బంతుల్లో 12 బౌండరీల సహాయంతో లక్ష్యాన్ని చేధించింది. అత్యధికంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తమిళనాడుకు నాలుగు పాయింట్లు లభించాయి.

బీచ్ కబడ్డీ జట్ల ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 23: గుంటూరులోని బాపాట్లలో ఈనెల 25 నుంచి 28 వరకు జరుగనున్న 10వ జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టును ప్రకటించారు. సీనియర్ పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన బీ.శ్రీ్ధర్, మహిళల జట్టుకు వరంగల్ జిల్లాకు చెందిన కే.మహేశ్వరి.. తెలంగాణ జట్టుకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారని తెంలగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి కె.జగ్దీష్ యాదవ్ తెలిపారు. బాపాట్ల సూర్యలంక బీచ్‌లో నిర్వహించే చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికైన వారి పేర్లు కింది విధంగా ఉన్నాయి.
* పురుషుల జట్టు: బీ.శ్రీ్ధర్ (కెప్టెన్), ఎల్.ప్రశాంత్, ఈ.కిషన్, చందా సజిన్‌కుమార్, రామవత్ గణేష్, బీ.ఆకాష్ యాదవ్. జట్టు కోచ్‌గా ఎస్.వెంకటేష్, మేనేజర్‌గా శివానంద్ వ్యవహరిస్తారు.
* మహిళల జట్టు: కే.మహేశ్వరి (కెప్టెన్), ఆర్.అఖిల, బీ.పూష్పాంజలి, ఎస్.వచన రెడ్డి, ఈ.సరిత, ఏ.శివజ్యోతి. జట్టు కోచ్‌గా టీ.జ్యోతిశ్వర్, మేనేజర్‌గా లింగం గౌడ్ వ్యవహరిస్తారు.