హైదరాబాద్

జాబితా పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరం పరిధిలో అక్రమ లే అవుట్లలోని ఖాళీ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రకటించిన స్కీం కింద జీహెచ్‌ఎంసీకి వచ్చిన దరఖాస్తుల్లో యూఎల్‌సీ భూములకు సంబంధించిన దరఖాస్తుల జాబితాను ప్రత్యేకంగా పంపాలని సర్కారు జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
ఈ నెలాఖరుతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, క్లియరెన్స్‌ల జారీకి గడువు ముగియనుండటంతో దరఖాస్తుల పరిశీలన ఊపందుకుంది. అయితే యూఎల్‌సీ, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలోకి వచ్చే దరఖాస్తుల పరిశీలనపై ఎం చేయాలన్న అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులు తర్జనభర్జన పడుతున్న సమయంలో స్వీకరించిన దరఖాస్తుల్లో పరిష్కారానికి ఆమోదయోగ్యమైన వాటిని పరిష్కరించి, వాటిలో యుఎల్‌సీ పరిధిలోకి వచ్చే దరఖాస్తుల జాబితాను పంపాలని సర్కారు ఆదేశించింది. అంతేగాక, ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన దరఖాస్తులను నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు పంపేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు జాబితాను సిద్దం చేస్తున్నారు. మొత్తం 71వేల 764 దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ స్వీకరించగా, ఇందులో 14వేల 698 దరఖాస్తులు యూఎల్‌సీ పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చినవి కాగా, 661 ఎఫ్‌టీఎల్, వక్ఫ్ భూములకు సంబంధించినవి 475, టైటిల్ వివాదాలకు చెందిన 584 దరఖాస్తులతో పాటు మొత్తం సుమారు 18వేల 68 దరఖాస్తులు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 60వేల 317 దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం వివిధ దశల్లో ఉండగా, 15వేల 197 దరఖాస్తులకు క్లియరెన్స్‌లను జారీ చేశారు. ఇదిలా ఉండగా, అన్ని యుఎల్‌సీ మినహా ఇతర దరఖాస్తులన్నింటిని పరిశీలించి, పరిష్కరించి క్లియరెన్స్‌లు ఇచ్చేందుకు సర్కారు ఈ నెలాఖరు వరకు గడువు విధించటంతో సమయం దగ్గరపడుతుండటంతో తొలుత జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే షార్ట్ఫాల్‌లను స్వీకరిస్తామని చెప్పారు. కానీ ఇపుడు గడువు ముగిసే చివరి నిమిషం వరకు కూడా షార్ట్ఫాల్‌ను స్వీకరించాలని అధికారులు భావిస్తున్నారు. కానీ అది అప్‌లోడ్ అయిన తర్వాత దరఖాస్తుదారుడితో మలిదశ ఫీజు ఎపుడు కట్టించుకుంటారు? ఎపుడు క్లియరెన్స్‌లు ఇస్తారన్న అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావటం లేదు. కానీ గడువు ముగిసేలోపు షార్ట్ఫాల్ క్లియర్ చేసుకుని, రెండో విడత ఫీజులు చెల్లించిన వారికి గడువు ముగిసిన తర్వాత కూడా క్లియరెన్స్‌లు జారీ చేస్తామని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.