హైదరాబాద్

ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్‌లకు ఈఆర్‌పీ ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: మహానగరంలో అక్రమ లే అవుట్లలోని ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్‌కు గడువు దగ్గరపడుతోంది. ఈ నెలాఖరు వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఇప్పటికే మున్సిపల్ వ్యవహారాల శాఖ నుంచి ఆదేశాలు అందాయ.
ఈ ఆదేశాలు రాక ముందు కేవలం 25 శాతం దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులు మిగిలిన వాటిని కూడా త్వరితగతిన క్లియర్ చేసేందుకు మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఈ స్కీం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్‌ల పరిధుల్లో మొత్తం 71వేల 764 దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ స్వీకరించగా, ఇందులో 14వేల 698 దరఖాస్తులు యూఎల్‌సీ పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చినవి కాగా, 661 ఎఫ్‌టీఎల్, వక్ఫ్ భూములకు సంబంధించినవి 475, టైటిల్ వివాదాలకు చెందిన 584 దరఖాస్తులతో పాటు మొత్తం సుమారు 18వేల 68 దరఖాస్తులు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 60వేల 317 దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం వివిధ దశల్లో ఉండగా, 15వేల 197 దరఖాస్తులకు క్లియరెన్స్‌లను జారీ చేశారు. ఇదిలా ఉండగా, అన్ని యుఎల్‌సీ మినహా ఇతర దరఖాస్తులన్నింటిని పరిశీలించి, పరిష్కరించి క్లియరెన్స్‌లు ఇచ్చేందుకు అధికారులు ఇతర శాఖల అధికారులను ప్రత్యేకంగా సమన్వయం చేసుకునేందుకు కృషి చేస్తుంటే, దరఖాస్తుదారులు సమర్పించిన డీడీల తాలుకూ నగదును జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ చేసేందుకు ఈఆర్‌పీ విభాగంలో తీవ్ర అలసత్వం జరుగుతోంది. చెక్కుల ద్వారా చెల్లిస్తే బౌన్స్ అయ్యే అవకాశమున్నా, డీడీల ద్వారా చెల్లించిన ఫీజులను బ్యాంకులను నిర్దారిస్తున్నా, జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం డీడీలు రెమిట్ అయినట్లు ఈఆర్‌పీ సెక్షన్ నుంచి క్లియరెన్స్ పత్రాలను తీసుకురావాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. కొన్ని దరఖాస్తులకు సంబంధించి డీడీలను సమర్పించినా, దరఖాస్తులు తిరస్కరణకు గురి కావటం, మరికొన్ని దరఖాస్తులకు సంబంధించి డీడీలు గల్లంతు కావటం వంటి లోపాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు జరిగిన దరఖాస్తుల తాలుకూ యజమానులు డీడీ తీసుకున్న బ్యాంకులను ఆశ్రయించగా, తామిచ్చిన డీడీ కమిషనర్ పేరిట జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ అయినట్లు చెప్పటంతో చేసేదేమీ లేక వారు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈఆర్‌పీ విభాగంలోని అధికారులు మాత్రం సకాలంలో డీడీలను ఖాతాలో జమ చేయకుండా పక్కన పడేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డీడీ స్వీకరించగానే క్లియరెన్స్‌లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా, అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదు. క్లియరెన్స్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఇకపై జోన్ల స్థాయిలో విధులు నిర్వర్తించే జీహెచ్‌ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్లు డీడీలను స్వీకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈఆర్‌పీ క్లియరెన్స్‌లు ఇవ్వాలని టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు.