హైదరాబాద్

ఇదిగిదిగో సొరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: పాతబస్తీ పరిధిలోని డబీపురాలో ఒక నిర్మాణం కోసం కొందరు కూలీలు మట్టి తవ్వుతుండగా సొరంగ మార్గం బయటపడింది. ఆదివారం మధ్యాహ్నా సమయంలో జరిగిన ఈ సంఘటనపై డబీపురా పోలీసులకు వారు సమాచారం అందించారు.
ఒక భవన పిల్లర్ నిర్మాణం కోసం కార్మికులు తవ్వుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఈ సొరంగం దాదాపు నాలుగున్నర అడుగులు తవ్వినా ఇంకా లోపలికి వెళ్లడంతో సాధ్యం కాక ఆ పని నిలిపివేశారు. ఈ సొరంగం అసఫ్ జాహిల కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఆనాడు వినియోగించిన ఫిరంగి, వాటి గుళ్లు కొన్ని దొరికాయి. డబీర్‌పురా పోలీసులు ఈ విషయాన్ని హెరిటేజ్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు విచ్చేస్తారని డబీపురా ఇన్‌స్పెక్టర్ డి.వెంకన్న నాయక్ తెలిపారు. డబీపురా దార్వాజా గోడను ఆనుకుని ఈ సొరంగం ఉండి ఉంటుందని, దీని పొడవు పాతబస్తీ నుంచి దాదాపు ఆరు మైళ్ల వరకు ఉండవచ్చని పాతబస్తీకి చెందిన చారిత్రక నిపుణులు చెబుతున్నారు.
డబీర్‌పురా దార్వాజా గోడ నిర్మాణం కుతుబ్‌షాహిల కాలంలో చేపట్టి అసఫ్ జాహిల కాలం నాటికి పూర్తయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సొరంగం చూసేందుకు పాతబస్తీనుంచే కాకుండా సమీప ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. పోలీసులకు వారిని నియంత్రించడం కష్టంగా మారింది.
ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. హెరిటేజ్ శాఖ అధికారులు సోమవారం వచ్చి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ఈ తరహా సొరంగాలు గతంలో ఆలియాబాద్, లాల్ దర్వాజ్ ప్రాంతంలో కూడా బయటపడ్డాయి. వీటిలో భాగంగా ఈ సొరంగం ఉందా..? మరేదైనా కొత్తదా అని తేలాల్సి ఉంది.