హైదరాబాద్

సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 25: 42వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తూ అనేక సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని బీసీ కమీషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణ మోహనరావు అన్నారు. ఆదివారం అంబర్‌పేట్ రాష్ట్ర మేదర సంఘం భవనంలో నిర్వహించిన తెలంగాణ బీసీ జాగృతి ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం వెయ్యి కోట్లేనని తెలిపారు. అన్ని ప్రభుత్వాలు బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల జీవితాలలో మెరుగైన ప్రమాణాల కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుబ్బారావు, కార్పొరేటర్ పులిజగన్, గరిగంటి రమేష్, వనం రమేష్, లింగం గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.