హైదరాబాద్

‘అత్యధిక మెజారిటీతో గెలుస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో తమ యూనియన్ ఈసారి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవటం ఖాయమని టీఆర్‌ఎస్‌కేవీ ఉమ్మడి అభ్యర్థి, జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖైరతాబాద్, రామచంద్రాపురం, పటాన్‌చెరువు, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోని బల్దియా ఆఫీసుల్లో ఉద్యోగులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాన కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గోపాల్ మాట్లాడుతూ ఈ సారి తనను గెలిపిస్తే ప్రతి ఉద్యోగికి హెల్త్‌కార్డు, ఇంటి స్థలాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఉద్యోగులు, కార్మికుల మధ్య తిరిగి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. జీహెచ్‌ఎంసీ కార్మికులకు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఉగాదికి హెల్త్‌కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందుకు ఇటీవలే పారిశుద్ద్య కార్మికులకు జీతాలను పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మిక సంఘం నేత కే.అమరేశ్వర్ మాట్లాడుతూ ఔట్‌సోర్స్ ఉద్యోగుల స్థానంలో కూడా వారి కుటుంబ సభ్యులనే నియమించేలా ఉత్తర్వులు జారీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి గోపాల్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు రాంబాబు, జబ్బార్, శంకర్, విఠల్‌రావు కులకర్ణి, నర్సింగ్‌రావు, యాదగిరి, శంకర్, రాజు పాల్గొన్నారు.