క్రైమ్/లీగల్

నకిలీ డాక్యుమెంట్లతో భారీ రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: నకిలీ డాక్యుమెంట్లను వినియోగించి తార్నాక ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.95 లక్షలు రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామ్‌నగర్ గుండుకు చెందిన కేశపాగ భాస్కర్ (39)ను అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రూ.95లక్షలు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు.
అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో ఈ ఏడాది జనవరి 22న బ్యాంక్ చీఫ్ మేనేజర్ పిఆర్‌కె దుర్గారావు (54) సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్.అరుణ్‌కుమార్, మీర్జా యాసిన్ బేగ్, కేశపాగ భాస్కర్‌లపై ఆయన ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీనిలో కీలక నిందితుడు భాస్కర్‌ను అరెస్టు చేసినట్లు సిసిఎస్ డిసిపి తెలిపారు.
ఈ కేసును ఎస్‌ఐ ఎ.పురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కె.రమేష్ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు.