హైదరాబాద్

రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సుభాష్ చంద్రబోస్, శివలాల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2018 ప్రారంభమైంది. ఈనెల 23 వరకు పాతబస్తీ దూల్‌పేట్‌లోని కూలీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ (కూడా) మినీ స్టేడియంలో నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో దాదాపు 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీలు 11 వెయిట్ కేటగిరిల్లో 32, 38, 42, 46, 50, 55, 60, 66, 74, 84 కేజీలతో పాటు 84ప్లస్ కేజీల విభాగంలో జరుగుతున్నాయి. చాంపియన్‌షిప్‌ను మంగళవారం కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్ కేసరి టైటిల్ కోసం జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో నిర్వహించిన పోటీలో భాగంగా 32 కేజీల వెయిట్ కేటగిరిలో ఈ.యోగేష్ బైఫాల్‌తో ఆకాష్ సింగ్‌పై, ఎల్.సంజయ్ సింగ్ 10-0 పాయింట్ల తేడాతో అరుణ్‌పై, సయ్యద్ యాసీన్ 4-0తో ఎన్.ఆదిత్యపై గెలుపొందాడు.
కాగా, సుభాష్ చంద్రబోస్ టైటిల్ కోసం జరిగిన పోటీలో జే.ప్రవేష్ సింగ్ 10-0 పాయింట్ల తేడాతో ఆర్.నరేంధర్‌పై, దినేష్ 4-3తో సాయిదీప్‌పై నెగ్గారు. బాల్ కేసరి టైటిల్ కోసం జరిగిన పోటీలో భాగంగా 60 నుంచి 66 కేజీల కేటగిరిలో నిర్వహించిన పోటీలో విజయ్ కుమార్ 5-0 పాయింట్ల తేడాతో జే.రోహిత్ సింగ్‌పై, హెచ్.్ధన్‌రాజ్ 8-1తో వినయ్ కుమార్‌పై విజయం సాధించాడు. జాతీయ స్థాయి మహిళ రెజలర్స్ కోసం నిర్వసించిన ప్రధర్శన పోటీలో హర్యానాకు చెందిన రియా అదునాతన టెక్నిక్‌లతో యూపీకి చెందిన ప్రియాంకపై గెలుపొందింది. మంగళవారం రాత్రి దూల్ పేట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు విక్కీసింగ్, సీ.వెంకటేష్, విజయ్‌సింగ్, రాజీవ్ గాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు అనిల్ కుమార్, ఆలిండియా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బీ.విజయ్ కుమార్, అంతర్జాతీయ రెజ్లర్ ప్రవీణ్‌రాణా, తదితరులు పాల్గొన్నారు.